"బహిరంగ" ప్రదేశాల్లో అవి ఉండకూడదు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల పై హైకోర్ట్ తన కోపాన్ని వెళ్ళగక్కింది.ఇరు రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్ల పై అసంతృప్తి వ్యక్తం చేసింది.

 High Court Serious On Both Governments-TeluguStop.com

అవన్నీ తీసేయ్యాలి అని, ఇలాంటి వాటిని బహిరంగ ప్రదేశాల్లో పెట్టడం నిషేదం అని.వాటిని తక్షణమే తొలగించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు చెందిన మునిసిపల్ అధికార్లు, డీజీపీ, కలక్టర్,ఎస్పీల ను ఆదేశించింది.

ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇవి ఉండడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురి అవుతున్నారు అని, వీటి తొలగింపునకు ప్రభుత్వం జీవో జారీ చేసినా పట్టించుకోవడం లేదు అంటూ ధాఖలైన పిటీషన్ పై హై కోర్ట్ విచారణ చేపట్టింది.

న్యాయవాది ప్రసాద్ వేసిన పిటీషన్ ను స్వీకరించిన హై కోర్ట్ ఈ మేరకు ఆదేశాలిస్తూ ఈ కేసును వారానికి వాయిదా వేసింది.అంతేకాకుండా మరో పక్క పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న విగ్రహాలపై కూడా ఇరు రాష్ట్రాలు సమీక్ష జరపాలి అని హై కోర్ట్ ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube