చంద్రబాబు వసూళ్ళ కి హై కోర్టు చెక్

రాజధాని అమరావతి నిర్మాణం కోసం విద్యార్ధుల నుంచి రూపాయలు 10 వసూలు చెయ్యడం కోసం చంద్రబాబు తలపెట్టిన నిర్భంద వసూలు కి ఏపీ విద్యా శాఖ సర్క్యులర్ కూడా విడుదల చేసింది.అమరావతి నిర్మాణం కోసం ” మై బ్రిక్ మై అమరావతి ” పేరుతో ఆన్లైన్ లో ఇటుకల ఫండింగ్ ఎంతవరకూ సాగిందో చూసిన తరవాత దాని రెస్పాన్స్ ని బట్టి పిల్లల దగ్గర ఏపీ ప్రభుత్వం వసూళ్ళ కార్యక్రమం మొదలు పెట్టింది.

 Court Shocks Chandrababu Naidu-TeluguStop.com

విద్యా శాఖ జారీ చేసిన సర్క్యులర్ చూసిన వారు అందరూ ఇది నిర్భంద వసూలు అనే అంటున్నారు.ఈ వ్యవహారం ఇప్పుడు హై కోర్టు వరకూ వెళ్ళడం వారు సీరియస్ అవ్వడంతో తెల్లమొహం వెయ్యడం ప్రభుత్వం వంతు అవుతోంది.

విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి నిర్బంధ వసూళ్ళకు విద్యాశాఖ ఎలా సర్క్యులర్‌ జారీ చేస్తుందని హైకోర్టు ప్రశ్నించడం గమనార్హం.

చంద్రబాబు సూచనలతో, మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, హైకోర్టు ఇచ్చిన ఝలక్‌తో అధికార పార్టీలో తీవ్రమైన కుదుపు కన్పిస్తుంది.ఇదివరకు కొన్ని వివాదాస్పద జీవో లలో “నాకు తెలియకుండా జరిగిపోయింది” అని నాలిక కరుచుకున్న బాబు గారు ఇప్పుడు ఈ సర్క్యులర్ విషయంలో కూడా ” అధికారుల దే తప్పు” అనేసినా ఆశ్చర్యపోనక్కర లేదు ఏమో .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube