Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మెగాస్టార్‌ మ‌ర‌ద‌లిగా స‌మంత - ప‌వ‌న్‌కు వ‌దిన‌గా అనుష్క‌-Heroines For Megastar Multistarrer Movie

టాలీవుడ్‌లో మెగా బ్ర‌ద‌ర్స్ మెగాస్టార్ – ప‌వ‌ర్‌స్టార్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మెగాస్టార్‌కు మ‌రో క్రేజీ హీరోయిన్ స‌మంత మ‌ర‌ద‌లు అవుతోంది. ప‌వ‌ర్‌స్టార్‌కు అనుష్క వ‌దిన‌మ్మ అవుతోంద‌ట‌. విన‌డానికి చిత్ర విచిత్రంగా ఉన్న ఈ కొత్త వ‌ర‌స‌ల సంగ‌తేంటో చూద్దాం.

మెగాస్టార్ – పవర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా అనగానే టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ అయ్యింది. మాట‌ల మంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తార‌ని చిత్ర నిర్మాత సుబ్బారామిరెడ్డి ప్ర‌క‌ట‌న చేసినప్ప‌టి నుంచే ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ సినిమాను అగ్ర నిర్మాత‌లు సుబ్బ‌రామిరెడ్డి – చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. చిరుకు రూ.25 కోట్లు, ప‌వ‌న్‌కు రూ.25 కోట్లు, త్రివిక్ర‌మ్‌కు రూ.15 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఉంటుందని..టోట‌ల్ సినిమా బ‌డ్జెట్ రూ.100-120 కోట్ల మ‌ధ్య‌లో ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవ‌రు ఉంటార‌న్న అంశంపై ఇండ‌స్ట్రీలో అప్పుడే చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. చిరుకు జోడీగా అనుష్క‌, ప‌వ‌న్ ప‌క్క స‌మంత అయితే క‌రెక్టుగా సెట్ అవుతుంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. చిరు-ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్లుగా ఈ క్రేజీ సినిమాలో వీరు ఫిక్స్ అయితే పైన చెప్పిన‌ట్టు వ‌ర‌స‌లు అదిరిపోతాయిగా..!

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top