తాప్సి కూడా మొదలెట్టబోతుంది

ప్రస్తుత హీరోయిన్స్‌ తెలివిగా ఆలోచిస్తున్నారు.హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గిన సమయంలో వీరు వేరే ఏదైనా బిజినెస్‌లోకి వెళ్తున్నారు.

 Taapsee To Produce Ganga Movie In Bollywood-TeluguStop.com

ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ పలు బిజినెస్‌లతో బిజీ అయ్యారు, అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.హీరోయిన్స్‌లో ఎక్కువ మంది నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.

టచ్‌ ఉన్న ఫీల్డ్‌ అవ్వడంతో ఇబ్బందులు ఎక్కువగా ఉండవనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నారు.అందరి దారిలోనే హీరోయిన్‌ తాప్సి కూడా వెళ్లాలని నిర్ణయించుకుంది.

ఈమె మొదటి సినిమాను హిందీలో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.ఈ అమ్మడు తాజాగా ‘కాంచన`2’ సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

త్వరలోనే ‘గంగ’గా ఆ సినిమా విడుదల కాబోతుంది.ఇప్పటికే తమిళంలో సక్సెస్‌ అయిన ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

దాంతో ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని తాప్సి భావిస్తోంది.ఇప్పటికే ఈమె ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి ‘కాంచన`2’ను రీమేక్‌ చేయాలని ఈమె నిర్ణయించింది.త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube