ఈ సంక్రాంతికి వార్ నందమూరి వర్సెస్ అక్కినేని అన్నట్లుగా జరిగిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన నందమూరి హీరోల సినిమాలు ‘డిక్టేటర్’ మరియు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలతో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన చిన్న బడ్జెట్ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’ పోటీ పడటం జరిగింది.
ఈ మూడు చిత్రాల మధ్య పోటీలో ‘డిక్టేటర్’ ముందే చేతులు ఎత్తేయగా, చివరి వరకు ‘నాన్నకు ప్రేమతో’ మరియు ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలు హోరా హోరీగా తలపడ్డాడయి.పైకి చూసేందుకు మాత్రం పై చేయి నాన్నకు ప్రేమతో అన్నట్లుగా అనిపించినా కూడా అసలు సంక్రాంతి విజేత కింగ్ నాగార్జున అని లెక్కలు చెబుతున్నారు.
‘నాన్నకు ప్రేమతో’ మరియు ‘డిక్టేటర్’ చిత్రాలు రెండూ కూడా 40 కోట్ల పై బడిన బడ్జెట్తో తెరకెక్కాయి.కాని ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం మాత్రం 22 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లుగా తెలుస్తోంది.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ‘డిక్టేటర్’ పెట్టుబడి కూడా రాకుండా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది.ఇక ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పెట్టిన పెట్టుబడి కంటే కాస్త అధికంగా వసూళ్లు సాధించింది.
అయితే సోగ్గాడే చిన్ని నాయన చిత్రం మాత్రం తక్కువ బడ్జెట్తో తెరకెక్కడం వల్ల దాదాపు 25 కోట్ల లాభాలను నిర్మాత నాగార్జునకు తెచ్చి పెట్టినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం ఉంది.తమ స్టామినాను బట్టి సినిమా బడ్జెట్ను పెట్టుకోవాలని నాగార్జునను చూసి అంతా నేర్చుకోవాలని అంటున్నారు.
ముఖ్యంగా బాలకృష్ణ వంటి సీనియర్ హీరో 25 కోట్లకు మించి బడ్జెట్ పెట్టుకోవద్దని, ఇక యువ హీరో అయిన నాగార్జున 30 కోట్ల పరిధిలో సినిమాను చేస్తే నిర్మాతలకు లాభాలు రావడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.ఈ విషయంలో తప్పకుండా నాగార్జునను చూసి అంతా నేర్చుకోవాలని, ఆయన్ను ఫాలో అయితే అంతా లాభాల బాట పట్టవచ్చని అంటున్నారు.