అక్కడ ఇంటివాడైన రానా

తెలుగు హీరో రానా ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఈయన ఇప్పటికే బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని బాలీవుడ్‌లో ఏర్పర్చుకున్న విషయం తెల్సిందే.

 Rana Purchased A Terrace Apartment In Mumbai-TeluguStop.com

ఈ తెలుగు హీరో తాజాగా హిందీలో ‘బేబీ’ అనే చిత్రంలో నటించాడు.ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

దాంతో ఈయనకు హిందీలో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.హిందీలో వరుస చిత్రాలు చేస్తోన్న రానా ముంబైలో ఒక ఇల్లు ఉండాలని కోరుకున్నాడు.

అందుకే అక్కడ ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను ఇటీవలే కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

హిందీ చిత్రాల షూటింగ్‌కు వెళ్లిన ప్రతీ సారి కూడా హోటల్స్‌ లేదా స్నేహితుల ఇల్లలో ఉండటం రానాకు ఇబ్బందిగా ఉందట.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇకపై షూటింగ్‌ సమయంలో తన ఫ్లాట్‌లోనే ఈ హీరో ఉండబోతున్నాడు.

ఇక ఈయన తెలుగులో త్వరలో ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’ చిత్రాలతో రాబోతున్నాడు.ఈ రెండు చిత్రాల్లో కూడా రానా ముఖ్య పాత్రల్లో నటించాడు.

ఈ చిత్రాలు విడుదల అయిన తర్వాత రానా హీరోగా తెలుగులో కూడా సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి.ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతోంది.

మొత్తానికి రానా తెలుగు, హిందీల్లో వరుసగా సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube