ఊపిరి పీల్చుకున్న రామ్‌

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ తాజాగా ‘పండగచేస్కో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాతో రామ్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

 Ram Got Hit With Pandaga Chesko-TeluguStop.com

ఈయన నటించిన గత ‘ఎందుకంటే ప్రేమంటా’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్కా బోర్లా పడటంతో, దాదాపు సంవత్సరం గ్యాప్‌ తీసుకుని ‘పండగచేస్కో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాపై రామ్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

ఇప్పటికే మూడు ఫ్లాప్‌లు చవి చూసిన రామ్‌, మరో ఫ్లాప్‌ ఖాతాలో పడితే పరిస్థితి మారిపోవడం ఖాయం.ఈ సమయంలో రామ్‌కు ఈ సినిమా పర్వాలేదు అని టాక్‌ తెచ్చినప్పటికి, భవిష్యత్తుపై ఆశలు నిలిపింది.

‘పండగచేస్కో’ సినిమా తర్వాత రామ్‌ నటిస్తున్న సినిమాలు ‘శివం’ మరియు ‘హరికథ’.ఈ రెండు సినిమాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా అయినా సక్సెస్‌ అయితే రామ్‌ కెరీర్‌ మరో రెండు మూడు సంవత్సరాల వరకు సక్సెస్‌ లేకున్నా సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయి.ఇక ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ అయితే రామ్‌ క్రేజ్‌ రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి.

మొత్తానికి ‘పండగచేస్కో’ సినిమా రామ్‌లో కొత్త జోష్‌ను నింపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube