కింద మీద పడుతున్న యువ హీరో

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ప్రస్తుతం సక్సెస్‌ కోసం పరితపిస్తున్నాడు.వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన ‘పండగ చేస్కో’ చిత్రం సక్సెస్‌ను తెచ్చి పెట్టింది.

 Hero Ram Full Focus On Nenu Sailaja-TeluguStop.com

ఆ సక్సెస్‌ను కొనసాగించాలని ప్రయత్నించిన రామ్‌కు ‘శివమ్‌’ చిత్రంతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.‘శివమ్‌’ దెబ్బకు ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈయన ‘నేను శైలజ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఆ సినిమాకు ముందుగా ‘హరికథ’ అనే టైటిల్‌ను పెట్టారు.

తాజాగా ఆ టైటిల్‌ను మార్చడం జరిగింది.‘నేను శైలజ’ చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది.

‘శివమ్‌’తో పాటే ఈ సినిమా కూడా పూర్తి అవ్వాల్సి ఉంది.కాని ‘శివమ్‌’ ఎఫెక్ట్‌తో ఈ సినిమాలోని పలు సీన్స్‌ను రీ షూట్‌ చేశారు.

స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేర్పులు చేసి మళ్లీ ప్రెష్‌గా తెరకెక్కిస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడినదిగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా కోసం రామ్‌ చాలా కష్ట పడుతున్నాడు.యాక్షన్‌ సీన్స్‌తో పాటు డాన్స్‌ మరియు రొమాంటిక్‌ సీన్స్‌లలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తున్నాడు.

మరి రామ్‌ చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్‌ అయ్యేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube