చరణ్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యేనా?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను హీరోయిన్‌గా ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది.

 Ram Charan Planning Kajal Guest Role In Srinu Vaitla Movie-TeluguStop.com

అయితే ఈ సినిమాలో రకుల్‌తో పాటు మరో హీరోయిన్‌ కూడా ఉండనుందని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది.ఈ సినిమాలో కాజల్‌తో ఐటెం సాంగ్‌ లేదా ఒక గెస్ట్‌ రోల్‌ను వేయించాలని చరణ్‌ కోరుకుంటున్నాడు.

ఇప్పటి వరకు చరణ్‌, కాజల్‌ల కాంబినేషన్‌లో వచ్చిన నాలుగు సినిమాలు మంచి సక్సెస్‌ అయ్యాయి.

సక్సెస్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో కూడా కాజల్‌ను పార్ట్‌గా చేయాలని చరణ్‌ భావిస్తున్నాడు.

ఈ సినిమాకు ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.‘గోవిందుడు అందరి వాడేలే’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని నటించిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఇక ఈ సినిమాకు ‘దూకుడు’ కాంబినేషన్‌ అయిన కోన వెంకట్‌, గోపీమోహన్‌, శ్రీనువైట్లలు పని చేస్తుండటంతో తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమాను ఇదే సంవత్సరం దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్‌ చేస్తున్నారు.

మరి చరణ్‌ ఫాలో అవుతున్న ఈ కాజల్‌ సెంటిమెంట్‌ ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube