కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరోసారి తండ్రి అయ్యాడు.నిన్నటి తరం హీరోయిన్ షాలినీని 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న అజిత్‌కు ఇప్పటికే 7 సంవత్సరాల పాప ఉంది.
తాజాగా వీరికి బాబు పుట్టడంతో ఈ జంట ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు.వారసుడు రావడంతో అజిత్ ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా పండుగ చేసుకుంటున్నారు.
హీరోగా కెరీర్ స్టార్ రేంజ్లో ఉన్న అజిత్‌కు మరో సారి ప్రమోషన్ రావడంతో సంతోసంగా ఉన్నాడు.చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో షాలినీ బాబుకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లుగా డాక్టరు పేర్కొన్నారు.