బిగ్ బాస్ ఇంట్లోకి ఈరోజు రాబోయే కొత్త మెంబర్ ఎవరో చూడండి

సంచలనాత్మక షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది.నిత్యం టాప్ 3 ర్యాంకుల్లో తన స్థానాన్ని మెయింటేన్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా వెళుతోంది ఈ షో.

 Here Is The Rumored Name Of Bigg Boss New Wild Card Entry-TeluguStop.com

వీకెండ్స్ లో ఎన్టీఆర్ స్టార్ పవర్ పుణ్యమా అని రికార్డు టీఆర్పీలు కూడా వస్తున్నాయి.అ వారం డబుల్ ఎలిమినేషన్ అనే సంగతి మీకు తెలిసిందే.

అంటే ఇప్పటిదాకా జరిగిన విధంగా కాకుండా, ఈ వారం ఇద్దరు ఇంట్లోంచి బయటకి వెళ్ళాల్సి ఉంటుంది.అందులో ఒకరు మహేష్ కత్తి.ఆయన నిన్నే బిగ్ బాస్ హౌజ్ ని వీదాల్సి వచ్చింది.ఇక ఇంటి కొత్త కెప్టెన్ కావడం వలన శివబాలాజీ ఎలిమినేషన్ రౌండ్ కి వెళ్ళట్లేదు.

ఎలిమినేషన్ లో ముగ్గురి పేర్లు మిగిలి ఉన్నాయి.వారే హరితేజ, కల్పన మరియు దీక్ష పంత్.

మరి ఈ ముగ్గురిలో ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో ?

ఎవరు ఎలిమినేట అవుతున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం అయితే, మరో ఆసక్తికరమైన టాపిక్ ఎవరు ఈరోజు ఇంట్లోకి వస్తున్నారు? ఒక హాట్ గా ఉండే 30+ అబ్బాయిని పమించండి బిగ్ బాస్ అంటూ ముమైత్ ఖాన్ ఓ వారం రోజులనుంచి తెగ అడుగుతోంది.మరి ముమైత్ కోరిక తీరుతుందా లేక ప్రిన్స్ కోరుకున్నట్లు ఒక అందమైన అమ్మాయి ఇంట్లోకి దిగుతుందా?

దీక్ష పంత్ కి గ్లామర్ కోసం దించినా, దీక్ష అంచనాలను అందుకోలేకపోతోంది.గేమ్ పరంగా కూడా దీక్ష వీక్ గానే ఉంది.కాబట్టి గ్లామర్ కోసం మరో అమ్మాయిని తీసుకొస్తున్నారా లేక ప్రిన్స్, ఆదర్శ్ మాదిరి మరో కుర్రాడికి చాన్స్ ఇస్తారా? మాకు వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే యాక్టర్ నవదీప్ ఈరోజు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట.అయితే ఈ టాక్ ని అప్పుడే వార్తగా చూడాల్సిన అవసరం లేదు.ఇది రూమర్ కూడా కావచ్చు.

డ్రగ్స్ కేసు వివాదం వలన నవదీప్ పేరు బాగా హీట్ లో ఉంది.ఇలాంటి సమయంలో నవదీప్ షోకి బాగా హైప్ అండ్ మసాలా యాడ్ చేయగలడు అని భావించి బిగ్ బాస్ మేకర్స్ ఈ హీరోని సంప్రదించారట.

మరి నవదీప్ ఒకే అన్నాడో లేడో ఈ రాత్రి తెలిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube