శరీరాన్ని శుద్ధి చేసి విషాలను బయటకు పంపే ఇంటి చిట్కాలు

సీజన్ మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాగే శరీరంలో విషాలు కూడా పేరుకుపోతాయి.

 Herbs That Detox Your Body Naturally-TeluguStop.com

తేలికపాటి ఆహారంను మితంగా తీసుకోని విషాలను శరీరంలో నుంచి బయటకు పంపవచ్చు.అలాగే కొన్ని ఆహారాల ద్వారా కూడా విషాలను బయటకు పంపవచ్చు.

వాటి గురించి వివరాలను తెలుసుకుందాం.

కొత్తిమీర
శరీరంలో విషాలను బయటకు పంపటంలో కొత్తిమీర బాగా సహాయపడుతుంది.

దీనిలో ఆవశ్యక నూనెలు ఉండుట వలన బ్యాక్టీరియాను చంపి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.కొత్తిమీర జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి వికారాలను తగ్గిస్తుంది.

అలాగే రక్తంలో చక్కర స్థాయిలను బాలన్స్ చేస్తుంది.కూరలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను జల్లితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

త్రిఫల చూర్ణం
త్రిఫల చూర్ణంలో ఉన్న గుణాలు విషాలను బయటకు పంపటంలో సహాయపడతాయి.త్రిఫల చూర్ణంను ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయలతో తయారుచేస్తారు.

అరకప్పు వేడినీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి చల్లారిన తర్వాత త్రాగాలి.

వేపాకు
వేపాకు జీర్ణశక్తిని పెంచటమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

ప్రతి రోజు రెండు లేదా మూడు వేపాకులను తినటం వలన పేగుల్లోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశించి ప్రేగు శుభ్రపడుతుంది.

పుదీనా
పుదీనా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.

పుదీనా టీ తాగడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది.కడుపు నొప్పి, గ్యాస్ వదలడం, మలబద్దకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని విషాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube