బ్యాగు బరువు చిన్నారులకి ప్రమాదమవుతోందట!

ఈ కార్పోరేట్ స్కూళ్ల హడావుడి పెరుగుతున్నా కొద్ది చిన్నపిల్లల పుస్తకాలు పెరుగుతున్నాయి, అలాగే బారి బ్యాగు బరువు కూడా పెరుగుతోంది.ఒంటిచేత్తో పిల్లాడి బ్యాగ్ కింద దించడం కూడా కష్టంగా ఉంటోంది మనకు.

 Heavy School Bags Can Cause Hunchbacks And Backaches – Study-TeluguStop.com

అలాంటిది ఆ పసి వీపులు ఎంత అవస్థపడుతున్నాయో ! అన్నేసి పుస్తకాలు ఎందుకో, అంత బరువున్న పుస్తకాలు పిల్లలు మోయాల్సిన ఖర్మేంటో స్కూళ్ళకే తెలియాలి.

నిజానికి స్కూల్ బ్యాగ్ పిల్లల బరువులో 10 శాతానికి మించి ఉండకూడదని రూల్ ఉంది.

కాని ఎన్ని స్కూళ్ళు దాన్ని పాటిస్తున్నాయి.పోని, ఇన్ని పుస్తకాల అవసరం ఏంటి, పిల్లలతో ఇంత బరువు ఎందుకు మోయిస్తున్నారు అని తల్లిదండ్రులు అడుగుతున్నారా అంటే, లేదు.

ఈ విషయం మీద ఇప్పటికైనా మేల్కోవాలని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) తమ హెల్త్ కేర్ కమిటీ ద్వారా నిర్వహించిన ఒక సర్వేలో తెలిపింది.

ఈ సర్వే ప్రకారం మనదేశంలో 13 సంవత్సరాలకు తక్కువ ఉన్న స్కూలు పిల్లల్లో 68% మంది స్కూల్ బ్యాగ్ బరువు వలన వెన్నునొప్పితో, అలాగే కొన్ని తీవ్రమైన సమస్యలతో బాధపడే ప్రమాదంలో ఉన్నారట.

ఇదే సర్వే రిపోర్టు ప్రకారం పిల్లలు పుస్తకాల రూపంలో తమ బరువులో 45% దాకా మోస్తున్నారట.ఇది నిజంగా ప్రమాదమని, spondylitis, spondylolisthesis, persistent back aches, degeneration of spine, postural scoliosis లాంటి సమస్యలు ఇలాంటి బరువుని మోయడం ద్వారా పుట్టుకురావొచ్చని ASSOCHAM హెల్త్ కమిటీ ఛైర్మన్‌ బికే రావు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube