రకుల్ ప్రీత్ చెప్పే ఫిట్ నెస్ టీప్స్ చదవండి ఓసారి

రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కి మామూలు ప్రాధన్యతనివ్వదు.ఇక్కడ దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది, అయినా గుర్తు చేస్తున్నాం.

 Hear Helpful Gym Tips From Rakul Preet-TeluguStop.com

రకుల్ ప్రీత్ కి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో సొంతంగా F45 అనే జిమ్ ఉంది.తాను కష్టపడుతూ, తన కస్టమర్లని ఫిట్ నెస్ ప్రేమికులుగా తయారు చేస్తోంది మన రకుల్.
రకుల్ కి ఫిట్ నెస్ పిచ్చి ఇప్పుడిప్పుడే పట్టలేదు.తెలుసుగా, తాను మిస్ ఇండియా పోటిల్లో పాల్గొందని.మిస్ ఇండియా పోటిల్లో ఉండాలంటే ఫిట్ నెస్ లెవెల్స్ ఇంచు కూడా తగ్గకూడదు.ఏళ్ళుగా శ్రమపడుతోంది కాబట్టే, రకుల్ లావెక్కింది, రకుల్ ఫిగర్ ట్రాక్ తప్పింది అనే కామెంట్స్ ఎప్పుడు వినలేదు మనం.మరి మన జీమ్ ఓనర్ + స్టార్ హీరోయిన్ చెబుతున్న కొన్ని టిప్స్ ఫాలో అయిపోయి, మీరూ కూడా కాలరీలు కరిగించి ఫిట్ గా తయారవ్వండి.
“ఎలాగైతో మనం రోజూ ముఖాన్ని కడుక్కోని దుమ్ము ధూళి వదిలించుకుంటామో, సరిగ్గా అలాగే ఓంట్లోంచి టాక్సిన్స్, కొవ్వు లాంటివి వదిలించుకోవాలి.వ్యాయామాన్ని పనిలాగా భావించకుండా ఎంజాయ్ చేయాలి, దాన్ని పెద్ద బరువులా చూడొద్దు.ఫిట్ గా ఉండాలంటే ఒళ్ళు వంచి వర్కవుట్ చేయాల్సిందే.చెమట చిందించడాన్ని ఇష్టపడతాను నేను.ఓ రెండు మూడు రోజులు జిమ్ మానేసినా ఏదో వెలితి లాగా అనిపిస్తుంది.

తిండిని త్యాగం చేయొద్దు.తినాలి కాని మంచి డైట్ ఫాలో అవ్వాలి

నేనైతే ఇంటి తిండినే తింటాను.

బయటి తిండి, స్వీట్స్, ప్యాక్డ్ ఫుడ్ ని ముట్టుకోను.గోధుమ రొట్టే, పప్పుకి బాగా ప్రధాన్యతనిస్తాను.

అంతే తప్ప జిమ్ చేస్తున్నాం కదా అని సంప్లిమెంట్ల వెంట పడను” అంటూ జీమ్ మాస్టర్ రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube