ఏకాగ్రత పెరగటానికి పనికొచ్చే ఆహారం కావాలా ?

ఏ పనిచేయాలన్నా మనిషికి ఏకాగ్రత అవసరం.ఉదయాన్నే లేచి, గంటల ప్రయాణం ఆఫీసుకి చేసి, 7-8 గంటలు పనిచేయడం అంటే మామూలు విషయం కాదుగా.

 Healthy Foods To Increase Your Concentration Levels Omega 3 Fatty Acids , Omega-TeluguStop.com

అన్ని గంటల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటడం కష్టతరమే.స్టూడెంట్స్‌ పరిస్థితి ఇంకా దారుణం.

కేజిలకొద్ది పుస్తకాల చదవటం, విషయాలు గుర్తుకుపెట్టుకోగడం కష్టమైపోతుంది.అందుకే ఏకాగ్రత పెరగటం, నిలవటం ముఖ్యం.అందుకోసం డైట్ లో ఈ పదార్థాలు చేర్చుకోవాలి.

* ఎప్పుడైనా ఆలోచించారా ? రచయితల, శాస్త్రవేత్తలు కాఫీ కప్పు పట్టుకోని పనులెందుకు చేస్తారో? సినిమాల్లో స్టయిల్ కోసం చేతిలో పెట్టడం కాదు, నిజంగానే కాఫీ ఏకాగ్రతను పెంచుతుంది.

* చేపల్లో ఒమెగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఉంటాయని మేం చెప్పనవసరం లేదు.చేపలు తినటం వలన బ్రేయిన్ కి బ్లడ్ ఫ్లో పెరిగి చురుకుగా పనిచేస్తుంది.

* కాఫీ లాగా డార్క్ చాకోలేట్ లో కూడా కెఫైన్ కంటెంట్ ఉంటుంది.అలాగే యాంటిఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువే.

అందుకే ఇది ఏకాగ్రతను నిలుపుతుంది.అయితే, స్వచ్ఛమైన డార్క్ చాకోలేట్ మాత్రమే తినాలి.

Telugu Antioxidant, Healthy Foods, Healthyfoods, Proteins, Vitamin-Top Posts Fea

* గోధుమల్లో కార్బోహైడ్రేట్‌లు విటమిన్ బి, ప్రోటీన్‌లు.మీ బ్రెయిన్ సెల్స్ కి గోధుమ అందుకే అవసరం.

* గ్లూకోజ్ (మనం వాడే షుగర్ కాదు) కూడా ఏకాగ్రతను నిలుపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* ఉదయాన్నే నట్స్ తీసుకుంటే మీ జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతను పెంచుకున్నవారవుతారు.ఫైబర్, విటమిన్ ఈ బాగా కలిగిన నట్స్ బ్రెయిన్ లో ఎనర్జీని నింపుతాయి.

* బీన్స్, ఆవకాడో, బ్లూ బెర్రిస్ కూడా ఏకాగ్రతను నిలిపేందుకు సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube