Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

వేసవిలో చెరుకు రసం తాగితే వచ్చే లాభాలు -Healthy Benefits Of Sugar Cane Juice

ఇది ఎండకాలం .. ఈ కాలంలో మామిడికాయ ఎంత ఫేమసో, చెరుకు కూడా అంటే ఫేమస్. బయట ఎక్కడ చూసినా సరే ఓ చెరకు బండి దర్శమిస్తుంది.పచ్చిగా చెప్పాలంటే, ప్రతి రెండు గల్లిల్లో, ఓ చెరుకు బండి కనబడుతుంది. ఈకాలంలో చెరుకు బాగానే దొరుకుతుంది కాబట్టి, బయట ఎందుకు తాగడం అని అనుకునేవారు ఇంట్లో కూడా చెరుకు రసం చేసుకోని తాగవచ్చు. అందరు తాగుతారు కాని ఈ చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా ? అది మీ శరీరానికి చేసే లాభాలేంటో తెలుసా ?

* చాలా సింపుల్ విషయం .. చెరుకురసం మీ ఒంటిని హైడ్రేట్ చేస్తుంది. ఎండలో అడుగుపెడితే కాసేపట్లోనే మన శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ద్రవపదార్థం మన ఒంట్లో పడాలి. ఈకాలంలో చెరుకు రసాన్ని మించి, చవకగా దొరికే ద్రవపదార్థం ఇంకేముంది. ఇటు ఖర్చు ఎక్కవు కాదు, అటు ఈజీగా శరీరం హైడ్రేట్ అయిపోతుంది.

* చెరుకు రసంలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఈ ఎలిమెంట్ జీర్ణ సమస్యలకు పెద్ద పరిష్కారం. కాబట్టి ఈ వేసవిలో అజీర్ణం లాంటి సమస్యలు ఉంటే చెరుకు రసాన్ని ఇష్టపదండి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఒక పాయింట్ చెప్పాలంటే, ఈ వేసవిలో అజీర్ణ సమస్య వస్తే కూల్ డ్రింక్ తాగాలనుకుంటారు కొందరు. అలాంటివారు అనారోగ్యమైన కూల్ డ్రింక్ వదిలేసి, ఆరోగ్యకరమైన చెరుకు రసం తాగడం మేలు.

* ఎండాకాలంలో టాక్సిన్స్ సమస్య కొంచెం ఎకువగానే ఉంటుంది. దీంతో లివర్ లో టాక్సిన్స్ జమ కావచ్చు. అలాంటప్పుడు చెరుకు రసం బాగా పనిచేస్తుంది. ఇది లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదని ఎందరో డాక్టర్స్ చెప్పారు. కాబట్టి చెరుకు రసం తాగేందుకు ప్రయత్నించండి.

* రోడ్డు మీద వెళుతూ ఉంటే , ఎలాగో అలసటగా అనిపిస్తుంది. అప్పుడు మీ దృష్టి చెరుకురసం బండి వైపే ఎందుకు వెళుతుంది ? ఎందుకంటే అది మీ అలసట తీరుస్తుంది అని మీకు తెలుసు కాబట్టి. వేసవిలో అలసటగా ఉండే ప్రాణానికి మంచి స్నేహం ఈ చెరుకు రసం. ఇటు కడుపుని చల్లబరుస్తూనే, అలసటను పోగొడుతుంది. మంచి మూడ్ ని అందిస్తుంది.

* ఈ మండుటెండల మూలానా మన శరీరం ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. అలాంటప్పుడు మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని రీస్టోర్ చేసేది చెరుకు రసమే. ఎందుకంటే దీనిలో కాల్షియం, ఐరన్, పొటాషియం లాంటి న్యూట్రింట్స్ ఉంటాయి.

* ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. వేసవిలో చర్మం డ్రై గా మారుతుంది. బాడి హైడ్రేటెడ్ గా లేకపోతె ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు చెరుకు రసం మీ ఒంటిని హైడ్రేట్ చేసి చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

 • Devotional

  Why do Hindus apply turmeric on threshold of houses

  By

  ఈమధ్యకాలంలో సీటిల్లో పట్టించుకోవడం లేదు కాని, ఇంటి గడపకు పసుపు రాసి ఉండటం ఓ ఆచారం. కాని ఇలాంటి పద్ధతులని కేవలం...

 • News

  Balakrishna Eye on Penamaluru Constituency

  By

  ఏపీలోని అనంత‌పురం జిల్లా హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఎంత కంచుకోటో చెప్ప‌క్క‌ర్లేదు. టీడీపీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి అక్క‌డ టీడీపీ ఓట‌మి...

 • Genral

  Why we Shouldnt Pour Laundry Water on Feet

  By

  సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు....

 • News

  DJ – Duvvada Jagannatham story leaked

  By

  మాస్ యాక్షన్ సినిమాలని బాగా హ్యాండిల్ చేస్తాడని హరీష్ శంకర్ కి పేరుంది. మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్...

To Top