జామపండు తింటే శరీరానికి లాభాలే లాభాలు

జామపండు .చాలామందికిి ఇంట్లోనే దొరికే పండు ఇది.

 Healthy Benefits Of Eating Guava-TeluguStop.com

చవకగా, సులభంగా దొరుకుంది కాబట్టి చాలామంది దీనిని పట్టించుకోరు కూడా.కాని ఈ ఆర్టికల్ చదివి, జామపండు వలన శరీరానికి దొరికే లాభాలు తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా జామపండు తినడం ప్రారంభిస్తారు.

* ఆకుకూరల్లో దొరికే పీచు కంటే రెండింతలు ఎక్కువ పీచు జామపండులో దొరుకుతుంది.కమలాపండులో దొరికే విటమిన్ సి కన్నా ఐదు రేట్లు ఎక్కువ విటమిన్ సి జామకాయలో లభ్యం అవుతుంది.

* షుగర్ వ్యాధితో బాధపడేవారికి జామపండు ఒక ఔషధం లాంటిది.నమ్మడానికి కష్టంగా ఉన్నా, ఆపిల్ కన్నా ఎక్కువ పీచు ఉంటుంది జామకాయలో.

దీనివలన మలబద్ధకం కూడా నివారించవచ్చు.

* జామకాయలో విటమిన్‌లు, పీచు ఎక్కువగా ఉండి, క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి.

కాబట్టి అధికబరువుతో బాధపడేవారి జామపండు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

* చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే “కొల్లజాన్” చాలా అవసరం.

దీని ఉత్పత్తిని పెంచుతుంది జామ.అలాగే కొలెస్టరాల్ తగ్గించడంలో కూడా జామది కీలక పాత్ర.

* జామ ఆకులు వేసి, నీటిని మరిగించి, చల్లబడ్డాక యోని పరిసరాలని శుభ్రం చేసుకుంటే, యోని ని ఇంఫెక్షన్ల నుంచి కాపాడటమే కాకుండా, దుర్వాసన, మంట లాంటి సమస్యలను తగ్గించవచ్చు.

* జామ ఆకులు నమలడం వలన ఆకలి పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

* జామ ఆకులు నమలడం వలన పంటి నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు.

* విటమిన్ ఏ,బి,సి దొరికడం జామపండులో స్పేషాలిటి.

ఈ ఫలంలో పోషకాలు ఎక్కువ, కొవ్వులు తక్కువ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube