పిల్లలు చాకోలేట్ తినొచ్చా?

పిల్లలు, యవ్వనంలో ఉన్న అమ్మాయిలు ఎంతో ఇష్టంగా తింటారు చాకొలెట్స్.రోజూ చాకొలేట్ ఏంటి అని తల్లిదండ్రులు అనడంలో తప్పు లేదు, అలాగని పూర్తిగా చాకోలేట్ మానెయ్యమంటే అర్థం లేదు.

 Healthy Benefits Of Dark Chocolates-TeluguStop.com

చాకోలేట్ (క్యాండి కాదు) వలన కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి.అయితే ఇందులో షుగర్స్, ఫ్యాట్స్, కాలరీలు కూడా బాగానే ఉండటంతో, ప్రతిరోజూ ఎగబడి తినకుండా, అలా అప్పుడప్పుడు తింటే చాకోలేట్ మంచిదే.

ఎందుకంటే …

* డార్క్ చాకోలేట్లో ఫైబర్, మెగ్నీషియమ్, ఐరన్, కాపర్, పొటాషియం, సెలెనియమ్, జింక్ దొరుకుతాయి.

* డార్క్ చాకోలేట్లో ఉండే ఆర్గానిక్ కంపౌండ్స్ యాంటిఆక్సిడెంట్స్ లా పనిచేస్తాయి.

కొన్నిరకాల ఫలాల కన్న ఎక్కువ యాంటిఆక్సిడెంట్స్ చాకోలేట్లో లభించడం విశేషం.

* చాకోలేట్ లో ఉండే బయోఆక్టివ్ కంపౌండ్స్ ఆర్టెరీస్ లో రక్తప్రసరణని మెరుగుపరుస్తాయి.

అంతేకాదు, ఇవి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో పెట్టగలవు.

* చాకొలెట్లు బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని తగ్గించి, గుడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని పెంచుతాయి.

* చాకోలేట్ గుండెకి సంబంధించిన జబ్బులని అడ్డుకోగలదని ఇప్పటికీ ఎన్నొ పరిశోధనలు నిరూపించాయి.

* సూర్యరశ్మి, UV రేస్ నుంచి చర్మాన్ని సంరక్షించే లక్షణాలు డార్క్ చాకోలేట్ లో ఉంటాయి.

* కాఫీ ఎందుకు తాగుతారు? మెదడు చురుకుగా పనిచేయాలనే కదా.డార్క్ చాకోలేట్ లో కూడా కైఫెన్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube