కొత్తిమీర ఎందుకు మంచిదంటే

ఎన్నోరకాల వంటల్లో కొత్తిమీర వాడటం చూస్తుంటాం.కాని చాలామంది దీన్ని వంటని అలకరించడానికి వాడతారేమో అని భావిస్తుంటారు.

 Healthy Benefits Of Coriander Leaves-TeluguStop.com

అలాగే కూరలో కరివేపాకులా దీన్ని కూడా తీసిపారేసెవారు లేకపోలేదు.కాని కొత్తమీర ఒక అద్భుతాల నిధి.

* కొత్తిమీరలో శరీరానికి అవసరమైన పదకొండు రకాల ఆయిల్స్, ఆరు రకాల ఆసిడ్స్ దొరుకుతాయి.

* గాయాలు తగిలినచోట కొత్తమీర రాస్తే ఉపశమనం కలుగుతుంది.

ఎందుకంటే దీనిలో లైనోలిక్ ఆసిడ్ లభిస్తుంది.ఈ ఆసిడ్ లో యాంటిహ్యమెటిక్, యాంటిఅర్థిటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి.

ఇవి గాయాల మంటను చల్లారుస్తాయి.

* కొత్తిమీరలఓలో డిటాక్సివ్, యాంటిసెప్టిక్, యాంటిఫంగల్, యాంటిఅక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ.

కాబట్టి చర్మ సమస్యలతో పోరాడగలదు.

* ఇందులో ఉండే ఆయిల్స్ బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.

* ఇందులో ఐరన్ శాతం కూడా బాగానే ఉంటుంది.అందుకే రక్తహీనతతో బాధపడేవారు కొత్తిమీర ఇంటేక్ ని పెంచుకోవాలి.

* కొత్తిమీర బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో పెడుతుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.

* కొత్తిమీరలో లభించే నేచురల్ ఆయిల్స్, ముఖ్యంగా సిట్రోనెనాల్ నోటి అల్సర్స్ కి చెక్ పెడుతుంది.

* ఇందులో కాల్షియం కూడా ఎక్కువే.ఎముకల బలానికి కొత్తిమీర ఎంతో ఉపయోగకరం.

* అంతేకాదు, డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంలో, పీరియడ్స్ సమస్యలతో ఫైట్ చేయడంలో, కంటి ఆరోగ్యానికి పనికివచ్చే సహజమైన వనరుల్లో ఒకటి ఈ కొత్తిమీర.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube