కొబ్బరినీళ్ళ వలన కలిగే ప్రయోజనాలు

ఇంట్లో ఉన్నప్పుడు దాహమేస్తే నీళ్ళు తాగేస్తాం.ఇది మంచి అలవాటు.

 Healthy Benefits Of Coconut Water-TeluguStop.com

అదే బయట దాహమేస్తే కూల్ డ్రింక్ తాగుతుంటాం.ఇదే మంచి అలవాటు కాదు.

దాహాంగా అనిపించినా, అనుకోకుండా కంటికి కనిపించినా, కొబ్బరినీళ్ళు తాగడం ఆరోగ్యకరమైన అలవాటు.కొబ్బరినీళ్ళు మంచివే అని అందరికి తెలుసు, కాని కొబ్బరినీళ్ళు వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

* కొబ్బరినీళ్ళలో కాల్షియం, ఫాస్ ఫరస్, సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం లాంటి ఎలెక్ట్రోలైట్స్ దొరుకుతాయి.కాబట్టి, కూల్ డ్రింక్ లో దొరికే అనారోగ్యకరమైన సోడా, ఆడెడ్ షుగర్స్ కి బదులు శరీరంలో న్యూట్రింట్స్ పడటం మేలు.

* ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు థర్డ్ వరల్డ్ దేశాల్లో ప్రజలు ప్రాణాలు కాపాడే పద్ధతులలో కొబ్బరినీళ్ళు తాగించటం కూడా ఉండేది.

ఎందుకంటే ఇది రిహైడ్రేషన్ కి పనికివస్తుంది.

* హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడేవారు కొబ్బరినీళ్ళు తాగే అలవాటు చేసుకోవడం మంచిది.

ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మీ బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి.

* ఆటలు అడేవాళ్ళు, శారీరక కష్టం ఎక్కువ చేసేవాళ్ళు ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ కి బదులు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది.

ఎందుకంటే స్పోర్ట్స్‌ డ్రింక్స్ లో పొటాషియం తక్కువ, షుగర్స్ ఎక్కువ లభిస్తాయి.దానికి పూర్తి భిన్నంగా కొబ్బరినీళ్ళలో న్యూట్రీంట్స్ ఎక్కువ, షుగర్స్ తక్కువ ఉంటాయి.

* ఫైబర్ జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుందన్న విషయం మనకు తెలిసిందే.కొబ్బరినీళ్ళలో ఫైనర్ బాగా లభిస్తుంది.

అందుకే జీర్ణశక్తికి కొబ్బరినీళ్ళు గొప్ప వరం.

* మద్యం బాగా సేవిస్తే హ్యాంగోవర్ రావడం ఖచ్చితం.అలాంటి సమయంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది.

* మెటిమలకు, ఇతర చర్మ సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు ఉపయోగపడతాయి కొబ్బరినీళ్ళు.

* ఇక చివరగా చెబుతున్నా, చాలా ముఖ్యమైన విషయం .కొబ్బరినీళ్ళు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఎంతో ఉపయోగకరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube