గోంగూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

గోంగూరని తరచుగా ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.మలబద్దకం,కొవ్వు నిస్సత్తువ వంటి అనేక సమస్యలను తగ్గించటంలో గోంగూర సహాయపడుతుంది.

 Health Benefits Of Sorrel-TeluguStop.com

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గోంగూరలో ఉండే పీచు శరీరంలో కొవ్వును తగ్గించి గుండెకు మేలు చేస్తుంది.

ఈ ఆకులో పొటాషియం,ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండుట వలన ఒత్తిడిని నియంత్రించటంలో సహాయపడుతుంది.అంతేకాక రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

విటమిన్ ఏ అధికంగా ఉండుట వలన కంటి చూపును మెరుగుపర్చటమే కాకుండా రేచీకటి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఈ ఆకును తరచుగా తీసుకుంటే రక్త కణాల వృద్ధి జరిగి రక్తహీనత అదుపులో ఉంటుంది.

అంతేకాక శరీరంలో అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది.

నీరసం,నిస్సత్తువ ఉన్న సమయంలో గోంగూరను కూర లేదా పచ్చడి రూపంలో తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది.

గోంగూరను తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన మధుమేహ రోగులకు కూడా మంచిది.

అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గోంగూర వండటానికి అల్యూమినియం పాత్రలను మాత్రం ఉపయోగించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube