మధ్యాహ్నం నిద్ర మంచిదేనా కాదా ?

లంచ్ చేసామంటే చాలు, మనలో చాలామందిని నిద్రదేవత ఆవహిస్తుంది.ఆఫీసులో కాని, కాలేజిలో కాని ఉన్నామంటే నిద్ర మరీ ఎక్కువ వచ్చేస్తుంది.

 Benefits And Disadvantages Of Afternoon Sleep-TeluguStop.com

కొందరు అలా ఓ గంట నిద్రపోతే, మరికొందరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నిద్రపోతూనే ఉంటారు.మధ్యాహ్నం నిద్ర వలన లాభాలు మాత్రం చాలానే ఉన్నాయండోయ్.

అవేంటో చూద్దాం.

* మధ్యాహ్నం ఓ గంట , గంటన్నర అలా నిద్రపోయేవారికి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందట.

చదువుకునేవారికి ఇది చాలా ఉపయోగకరం.

* బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.

గుండే మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.

* మధ్యాహ్నం గంటన్నర నిద్రపోయే అలవాటు చేసుకుంటే, నరాల కదలిక బాగా ఉంటుందట.

అలాగే కోపం, స్ట్రెస్ కూడా తగ్గుతాయి.

* చురుగ్గా తయారవుతారు.

ఇదేదో వట్టిమాట కాదండోయ్.అమెరికా సైనికులపై ఒక రీసెర్చ్ చేసి స్టెట్‌మెంట్ ఇచ్చారు డాక్టర్లు.

మధ్యాహ్న నిద్రకు అలవాటైన సైనికుల కదలికలు, అలవాటు లేని సైనికుల కదలికల కంటే ఎంతో చురుగ్గా ఉన్నాయట.

* జేమ్స్ మాస్, రెబిక్కా రాబిన్స్ చేసిన రీసెర్చ్ ప్రకారం మధ్యాహ్నం నిద్ర వలన క్రియేటివిటి పెరుగుతుంది.

ఇదంతా చదివి అన్నీ లాభాలే ఉన్నాయని అతిగా నిద్రపోకండి.మూడు, నాలుగు, అయిదు గంటలపాటు నిద్రపోతే మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందట.

అలాగే, స్థూలకాయంతో బాధపడేవారు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేవారు ఈ మధ్యాహ్నం నిద్రకి దూరంగా ఉంటేనే మంచిదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube