వెన్ను నొప్పిని వేగంగా తగ్గించే ఆహారాలు

ఈ మధ్య కాలంలో వెన్ను నొప్పి అనేది అందరినీ వేదించే సమస్యలలో ఒకటిగా ఉంది.ఈ వెన్ను నొప్పి రావటానికి అధిక బరువు, సరైన జీవనశైలి లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.

 Healing Foods That Fight Back Pain Naturally-TeluguStop.com

కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే వెన్ను నొప్పి క్రమంగా తగ్గిపోతుంది.ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.ఈ ఆహారాలలో ఉండే పీచు గ్యాస్ట్ర్రిక్ , మలబద్దకం,వెన్ను నొప్పి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కుర్కుమిన్ వాపును తగ్గించటమే కాకుండా నాడీ వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

వెల్లుల్లిని నొప్పి నివారిణిగా చెప్పవచ్చు.

కొబ్బరి నూనెలో మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి ఆ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్ధన చేయాలి.మర్ధన చేయటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పి తగ్గుతుంది.

మసాలా టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన నొప్పిని నివారించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పాల ఉత్పత్తులను తరచుగా తీసుకోవాలి.ఎందుకంటే ఎముకలకు బలాన్ని ఇచ్చే క్యాల్షియం.పాల ఉత్పత్తులలో సమృద్దిగా ఉంటుంది.ఎముకలు బలంగా ఉంటే వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉండదు.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన ఆహారంలో అల్లంను తీసుకుంటే వెంటనే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube