బాహుబలి మీద రూ.10 కూడా పెట్టను, అదో చెత్త సినిమా అంటున్న డైరెక్టర్

దేశవ్యాప్తంగా ఏ సినిమా సృష్టించని సంచలనం సృష్టించింది బాహుబలి సీరీస్.మొదటిభాగం కేవలం ఓ ఝలక్ ఇస్తే, రెండొవభాగం విశ్వరూపం చూపిస్తే, మలయాళం మినిహా మిగితా అన్ని ప్రధాన ఇండస్ట్రీల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

 He Wouldn’t Spend Even 10rs On Waste Film Baahubali-TeluguStop.com

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లుకు పైగా గ్రాస్ వసూళ్ళను సాధించింది.భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన చిత్రంగా నిలిచింది.

జనాలు ఎగబడి తెగబడి భారీ టికేట్ రేట్లను సైతం లెక్కచేయకుండా ఈ సినిమాని చూసారు కాబట్టే ఇంత పెద్ద విజయం సాధ్యపడింది.కాని ఓ సీనియర్ దర్శకుడు బాహుబలి కనీసం ఓ పదిరూపాయలు కూడా పెట్టి చూడాల్సిన సినిమా కాదు అంటున్నారు.

అదూర్ గోపాలకృష్ణన్.ఈయన గురించి పూర్తిగా తెలియకపోయినా ఎప్పుడో ఓసారి పేరు వినే ఉంటారు.1960ల్లోంచి మొదలు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, డ్యాకుమెంటరీలు, కొన్ని ఫీచర్ ఫిలిమ్స్ తీసారు.ఆర్ట్ సినిమాలకు పెట్టింది పేరు.

కొత్తరకం ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ ని భారతీయ సినీరంగానికి పరిచయం చేసారు.ఆయన సినిమా రంగానికి చేసిన సేవకు భారత ప్రభుత్వం దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మభూషన్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

అలాంటి మేధావి బాహుబలిని తిట్టెసాడు.

బాహుబలి 1951లో వచ్చిన పాతాళభైరవికి కాపి అంట.“బాహుబలి ఓ చెత్త సినిమా, సమయం వృధా చేసే సినిమా, దాని మీద పది రూపాయలు కూడా పెట్టడానికి ఇష్టపడను, ఈ సినిమా సమాజం మీద చాలా నెగేటివ్ ప్రభావం చూపిస్తుంది” అంటూ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద విజయంగా నిలిచిన జకన్న బాహుబలిని కడిగిపారేశారు ఈ సీనియర్ ఫిలింమేకర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube