Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

24 కోట్ల సినిమాకు 150 కోట్ల కలెక్షన్స్‌!-Hate Story 3 To Cross 150 Crores Mark

బాలీవుడ్‌లో ఏ చిన్న చిత్రం సక్సెస్‌ అయినా కలెక్షన్స్‌ 100 కోట్లలోనే ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో వచ్చిన ‘హేట్‌ స్టోరీ 3’ చిత్రం సంచలన కలెక్షన్స్‌ రాబడుతూ సినీ వర్గాలను సైతం ఆకట్టుకుంటుంది. కేవలం 24 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు విపరీతమైన స్పందన రావడంతో సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల మార్క్‌ను చేరింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే 150 కోట్ల కలెక్షన్స్‌ను సైతం క్రాస్‌ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు అని అంటున్నారు.

ఈ సినిమాకు ముందు వచ్చిన ‘హేట్‌ స్టోరీ’ రెండు పార్ట్‌లు కూడా యూత్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా సైతం యూత్‌కు నచ్చే విధంగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. భావించినట్లుగానే ట్రైలర్‌లోనే దర్శకుడు ఈ సినిమాను పూర్తి చూపించాడు. హాట్‌ హాట్‌ సీన్స్‌తో ఈ సినిమాను నింపేసినట్లుగా ట్రైలర్‌ చూస్తే అర్థం అయ్యింది. దాంతో సినిమా విడుదలకు ముందు నుండే అంచనాలు అలా అలా పెరిగాయి. ఇక సినిమా వచ్చిన తర్వాత మస్త్‌గా హాట్‌ సీన్స్‌ ఉండటంతో మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఈ సినిమా బాలీవుడ్‌లో నిలుస్తోంది.

Continue Reading
To Top