రాం చరణ్ మారిపోయాడు

ఒక్కొక్క సినిమాకీ ఒక్కొక్క రకమైన షేవింగ్, కటింగ్ , లుక్ లలో కనపడ్డం మన హీరోలకి ఈ మధ్యన బాగా అలవాటుగా మారింది.ఒక పక్క తన 150 కోసం చిరంజీవి మీసం పెంచితే నాన్నకు ప్రేమతో తరవాత గడ్డం గీసి మరొక కొత్త స్టైల్ లో కనిపిస్తున్నాడు తారక్.

 Has Ram Charan Changed?-TeluguStop.com

ఇప్పుడు తనీ ఒరువన్ రీమేక్ కోసం రాం చరణ్ తేజ కూడా కొత్త లుక్ తో కనిపిస్తూ అందరి దృష్టినీ ఆసక్తినీ పెంచుతున్నాడు.

గత కొన్ని రోజులుగా బయటెక్కడా కనిపించని చరణ్.

ఇటీవల కార్ లో వెళ్తూ కెమెరా కంటికి చిక్కాడు.ఈ సందర్భంగా చరణ్ ఫ్రెంచ్ కట్ పెంచడం జనాల కళ్లల్లో పడింది.

హేర్ కట్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది.‘తనీ ఒరువన్’ రీమేక్ లో చేయబోయేది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి చరణ్ జుట్టు బాగా కత్తిరించుకోవడం ఖాయం.

ఫిట్ నెస్ విషయంలోనూ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.మొత్తంగా చరణ్ ఓ కొత్త లుక్ తో కనిపించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 10న ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube