మళ్లీ ‘మిరపకాయ్‌’

మాస్‌ మహారాజ రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల్లో ఒక్క చిత్రంగా నిలుస్తుంది ‘మిరపకాయ్‌’.ఆ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.

 Harish Shankar To Directs Special 26 Remake With Raviteja-TeluguStop.com

వీరిద్దరి కాంబినేషన్‌లో మొదట ‘షాక్‌’ సినిమా వచ్చింది.ఆ సినిమా భారీ ఫ్లాప్‌గా మిగిలింది.

ఆ తర్వాత వచ్చిన ‘మిరపకాయ్‌’ సూపర్‌ హిట్‌ను సాధించింది.ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చింది లేదు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్‌లో త్వరలోనే మరో సినిమాకు లైన్‌ క్లీయర్‌ అయినట్లుగా తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ జంటగా నటించి సూపర్‌ హిట్‌ అయిన ‘స్పెషల్‌ 26’ సినిమాను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్‌ చేస్తున్నట్లు కొన్ని నెలల ముందే అధికారిక ప్రకటన వచ్చింది.అయితే ‘కిక్‌`2’తో బిజీగా ఉన్న రవితేజ ఆ రీమేక్‌ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది.

ప్రస్తుతం ‘కిక్‌`2’ చివరి దశకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ‘స్పెషల్‌`26’ సినిమా చర్చలు జరుగుతున్నాయి.

ఈ రీమేక్‌కు హరీష్‌ శంకర్‌ పూర్తి న్యాయం చేయగలడని రవితేజ భావిస్తున్నాడట.దాంతో దర్శకత్వ బాధ్యతలు ఆయనకే అప్పగించాలని నిర్మాత భావిస్తున్నాడు.

ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ మూవీని సాయి ధరమ్‌ తేజ్‌తో చేస్తున్నాడు.ఆ సినిమా పూర్తి కాగానే రవితేజతో రీమేక్‌ చేసే అవకాశాలున్నాయి.

ఈలోపు రవితేజ ‘బెంగాల్‌ టైగర్‌’ను సంపత్‌ నంది దర్శకత్వంలో చేయనున్నాడు.మొత్తానికి మాస్‌రాజా రవితేజ ఈ సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube