మెగా ఫ్యామిలిని వదిలేలా లేడు ఆయన-Harish Shankar To Direct Another Mega Hero After DJ? 3 months

Dj Duvvada Jagannadham Harish Shankar To Direct Another Mega Hero After Dj? Ram Charan Sai D Haram Tej Photo,Image,Pics-

దర్శకుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ డైరెక్టర్ కూడా పలుమార్లు ఆ విషయాన్ని పబ్లిక్ గా చెప్పారు. ఎప్పుడైతే ఆ గబ్బర్ సింగ్ తీసారో, అప్పటినుంచి మెగాఫ్యామిలినే పట్టేసుకున్నారు హరీష్. మధ్యలో ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా మినహాయిస్తే, అన్ని మెగా ఫ్యామిలి సినిమాలే.

సాయిధరమ్ తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ తీసి ఓ యావరేజ్ తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం మరో మెగా హీరో అల్లు అర్జున్ తో డీజే – దువ్వాడ జగన్నాథం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సరిగా మొదలుకాక ముందే, మరో మెగాహీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట ఈ యువ దర్శకుడు.

ఆ మెగా హీరో మరెవరో కాదు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అవును, రామ్ చరణ్ – హరీష్ శంకర్ మధ్య కథాచర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా రామ్ చరణ్ – సుకుమార్ చిత్రం తరువాత మొదలవొచ్చు అని ఫిలింనగర్ టాక్.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ

About This Post..మెగా ఫ్యామిలిని వదిలేలా లేడు ఆయన

This Post provides detail information about మెగా ఫ్యామిలిని వదిలేలా లేడు ఆయన was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Harish Shankar to direct another Mega Hero after DJ?, Harish Shankar, DJ, Allu Arjun, Ram Charan, Duvvada Jagannadham, Sai D haram Tej

Tagged with:Harish Shankar to direct another Mega Hero after DJ?, Harish Shankar, DJ, Allu Arjun, Ram Charan, Duvvada Jagannadham, Sai D haram Tejallu arjun,dj,Duvvada Jagannadham,harish shankar,Harish Shankar to direct another Mega Hero after DJ?,ram charan,Sai D haram Tej,,