పవన్ కళ్యాణ్ పరువు తీసిన హరీష్ శంకర్

డిజే కలెక్షన్ల వివాదం రోజురోజుకి పెద్దగా అవుతోంది.అల్లు అర్జున్ సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతోందో కాని గత ఏడాది సరైనోడుకి పడిన ఫేక్ ట్యాగ్ ఈసారి డిజే – దువ్వాడ జగన్నాథంకి కూడా పడింది.

 Harish Shankar Drags Pawan Kalyan’s Name Into Fake Collections-TeluguStop.com

అయితే ఆ సమయంలో ఎవరు చాలెంజ్ విసరలేదు, కాని ఈసారి హరీష్ శంకర్ సైలెంట్ గా ఉండట్లేదు.డిజే కలెక్షన్లు తప్పు అని నిరూపిస్తే సినిమాలు మానేస్తా, కరెక్ట్ అని తెలిస్తే మీరు వెబ్ సైట్ మూసేస్తారా అంటూ ఒక టాప్ వెబ్ సైట్ మీద చాలెంజ్ విసిరారు హరీష్ శంకర్.

విషయం ఏమిటంటే, డిజే ఒరిజినల్ కలెక్షన్లు ఇంకా 50 కోట్లు కూడా దాటలేదని ఓ ప్రముఖ వెబ్ సైట్ (తెలుగు స్టాప్ కాదు) ఓ కథనాన్ని ప్రచూరించింది.46 కోట్లకు అటుఇటుగా ఫిగర్స్ పెట్టింది.అందులో నైజం ఫిగర్ 13 కోట్ల దగ్గరలో ఉంది.మరి ఆ కథనం చూసి కోపమే వచ్చిందో లేక డిజే నైజాంలో ఒక అరుదైన రికార్డు సాధించడం వలన వచ్చిందో కాని నైజాంలో డిజే 20 కోట్ల షేర్ చేసిందని ప్రకటించేశారు హరీష్ శంకర్.

అక్కడితో ఆగకుండా నైజంలో 20 కోట్లు చేసిన తన రెండోవ సినిమా డీజే అని, ఇంతకముందు గబ్బర్ సింగ్ కూడా ఇంత మొత్తం వసూలు చేసిందని ఇండైరేక్ట్ గా చెప్పేశారు.కాని గబ్బర్ సింగ్ 19 కోట్లలోనే ఆగిపోయింది.

ఇన్నేళ్ళ తరువాత మరో కోటి రూపాయల షేర్ ఎలా పెరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.ఈరకంగా డిజే ఫేక్ కలెక్షన్ల వివాదంలో అనవసరంగా పవన్ కళ్యాణ్ ని లాగారు హరీష్ శంకర్.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరువు తీయడం ఎందుకు అంటూ పవర్ స్టార్ అభిమానులు సైతం ఇబ్బందిపడుతున్నారు.

తన మీద విమర్శలు చేస్తే ఒకే కాని, తన యూనిట్ పడిన కష్టాన్ని అవమానపరిస్తే ఊరుకోనని, విజయాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కాని యుద్ధం తప్పలేదు అంటూ మరొకొన్ని ట్వీట్స్ వదిలారు హరీష్.

హరీష్ ఇంత గంభీరంగా మాట్లాడుతున్నా, నెటిజన్ల నుంచి మాత్రం నెగెటివ్ స్పందనే వస్తోంది.ఎన్నడు లేనిది దిల్ రాజు పేరు కూడా ఫేక్ కలెక్షన్ల వివాదంలో ఇరుక్కుందని, దీనికి కారణం ఎవరు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube