వైద్య శాఖలో హరీష్ రావు దూకుడు...అసలు కారణం ఇదేనా?

తెలంగాణ రాజకీయాల్లో  మంత్రి హరీష్ రావు కు ప్రత్యేక స్థానం ఉంది.రాజకీయ నాయకుడిగా పార్టీలకతీతంగా హరీష్ రావును గౌరవిస్తారు.

 Harish Rao Aggression In The Medical Department Is This The Real Reason Kcr, Trs-TeluguStop.com

మంత్రిగా ఏ శాఖ బాధ్యతలు చేపట్టినా ఆ శాఖలో తనదైన ముద్ర వేయడం హరీష్ రావుకే చెల్లింది.కాళేశ్వరం ప్రాజెక్ట్ సమయంలో హరీష్ రావు ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతగా అహర్నిశలు కృషి చేశారనేది మనకు తెల్సిందే.

అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి వదిలిపోయిందని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు ఒమిక్రాన్ రూపంలో మరో సారి కరోనా విజృంభిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే 38 కి పైగా ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదైన నేపథ్యంలో  హరీశ్ రావు నేతృత్వంలోని వైద్య ఆరోగ్య శాఖ వెంటనే అప్రమత్తమయింది.

Telugu @cm_kcr, Harish Rao, Trs-Political

ఇప్పటికే పలు ఆసుపత్రులను సందర్శిస్తూ   ఆసుపత్రులలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలిస్తూ అవసరమయిన చోట వైద్య పరికరాలను కూడా అందజేస్తూ ఒమిక్రాన్ ఒకవేళ విజృంభించినా ఎక్కడ కూడా ప్రజలకు వైద్య పరంగా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో మంత్రి హరీష్ రావు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ అధికారులను శాఖలను పరుగులెత్తిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో వైద్య శాఖ పరంగా ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వైద్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడంతో ఇక ప్రభుత్వ పరంగా ఎక్కువ శాతం నిధులు వెచ్చించి క్షేత్ర స్థాయిలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యంపై పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితుల నాటి నుండి ప్రస్తుత పరిస్థితుల  వరకు ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube