మాజీ ప్రియుడితో రొమాన్స్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబుతో ఆ మధ్య హన్సిక ప్రేమలో పడి మునిగి తేలిన విషయం తెల్సిందే.వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది.

 Hansika Romances To Her Ex-lover-TeluguStop.com

అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావిస్తున్న తరుణంలో వీరిద్దరి లవ్‌ బ్రేకప్‌ అయ్యింది.వీరి ప్రేమ బ్రేకప్‌కు కారణాలు కోలీవుడ్‌లో పలు వినిపించాయి.

కాని వారిద్దరు మాత్రం తమ బ్రేకప్‌ విషయాన్ని సింపుల్‌గా చెప్పారు.ఆ తర్వాత వీరిద్దరు కలిసింది లేదు.

వీరిద్దరి కలయికలో మొదలైన సినిమా ‘వాలు’ బ్రేకప్‌ వల్ల మధ్యలోనే ఆగిపోయింది.

ఆ సినిమాను పూర్తి చేయాల్సిందిగా ఇద్దరిని ఎంతగా నిర్మాత ప్రాధేయ పడినా కూడా ఫలితం లేకుండా పోయింది.

మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమాకు ఇద్దరు కలిసి నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను చేసేందుకు ‘వాలు’ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత ప్లాన్‌ చేస్తున్నారు.

మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ఆఫ్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ ఏమైనా మొదలు అవుతుందేమో అని తమిళ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.అయితే షూటింగ్‌ ఉన్నంత సేపు శింబుతో, ఆ తర్వాత ఆయన ఎవరో.

నేను ఎవరో అన్నట్లుగా ఉంటాను అంటోంది హన్సిక.మరి ఈ మాటపై ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube