ఆయనతో హన్సిక ప్రేమలో..!

తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు ఉన్న హన్సిక ప్రేమలో పడ్డట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ అమ్మడు గతంలో శింబుతో ప్రేమలో పడి, పెళ్లి వరకు వెళ్లింది.

 Hansika In Love With Hero Ravi-TeluguStop.com

అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కాని, శింబుతో ఈ అమ్మడి పెళ్లి జరగలేదు.కొంత కాలం పాటు సినిమాలతో బిజీ అయ్యింది.

వరుసగా సినిమాలు చేస్తూ, ఊపిరి మెసలనంత బిజీ అయ్యింది.మళ్లీ ఇప్పుడు ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తమిళ హీరో జయం రవితో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.తాజాగా వీరిద్దరు కలిసి నటించి ‘రోమియో జూలియట్‌’ సినిమా సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు.

ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో కూడా వీరిద్దరు తెగ రాసుకు పూసుకు తిరుగుతున్నారు.దాంతో వీరి ప్రేమను కన్ఫర్మ్‌ చేస్తున్నారు.

కాని హన్సిక మాత్రం తమ మద్య స్నేహం తప్ప మరే సంబందం లేదని చెప్పుకొచ్చింది.తమ మద్య రొమాన్స్‌ కేవలం వెండి తెరకే పరిమితం అంటూ తేల్చి చెప్పింది.

అయినా కూడా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను మీడియా మాత్రం వదిలి పెట్టడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube