మళ్ళీ ప్రేమలో పడాలని లేదు అంటున్న హాట్ హీరోయిన్

మిల్కీ వైట్ బ్యూటి హన్సిక మోత్వానీ కెరీర్ తొలినాళ్ళలో సినిమాల వలనే తప్ప, పర్సనల్ వ్యవహారాల వలన వార్తల్లో నిలవలేదు.కాని తమిళ హీరో శింబు ఎప్పటినుంచైతే పరిచయమయ్యాడో, అప్పటి నుంచి హన్సిక ప్రేమ వ్యవహారం తరచుగా మీడియాలో రావడం మొదలైంది.

 Hansika Lost Interest In Love-TeluguStop.com

ఇద్దరు ట్విట్టర్ లో పబ్లిక్ గా రొమాంటిక్ కబుర్లు పెట్టేవారు.

ఇద్దరు పెళ్ళి చేసుకోవడం ఖాయమని అందరు అనుకుంటే, సీన్ రివర్స్ అయ్యింది.

ఇద్దరు బ్రేక్ అప్ చెప్పేసుకున్నారు.ఇద్దరిలో తప్పు ఎవరిదో తెలియదు కాని, అప్పటికే నయనతారకి కూడా బైబై చెప్పేసిన శింబు హన్సిక మనసుని బాగా గాయపరిచినట్టున్నాడు.

అందుకే మళ్ళీ ప్రేమ జోలికి వెళ్ళాలనుకోవట్లేదట.

ప్రేమ అందమైన అనుభవమే అయినా, తన విషయంలో అలా జరగలేదని, ప్రస్తుతానికైతే మళ్ళీ అలాంటి ఆలోచనలు లేవని, పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది హన్సిక.

పాపం .దెబ్బ బాగా గట్టిగా తగిలినట్టుంది కదా!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube