షాకింగ్ విషయాలు వెల్లడించిన హనీ ప్రీత్ సింగ్

డేరా దత్తపుత్రికగా పిలవబడుతున్న హనిప్రీత్ సింగ్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చింది.అది కూడా రహస్యంగా.

 Hanipreet Sing Shocking Comments-TeluguStop.com

ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది.ఇప్పటివరకూ జరిగిన పరిణామాల గురించి తమ గోడు వెళ్ళగక్కింది.

గుర్మిత్ సింగ్ అరెస్ట్ అయ్యిన నేపధ్యంలో కనపడిన హనిప్రీత్.అప్పుడు జరిగిన అల్లర్లలో తన హస్తం ఉందని పోలీసులు ఆమెమీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అప్పటినుంచీ హనీ పరారీలో ఉంది.

కోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా సరే కోర్టు ఆమె అభ్యర్ధనని తిరస్కరించింది.అందుకే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది

అత్యాచారం కేసులో డేరాబాబా జైలుకెళ్లి 36 రోజుల తర్వాత మీడియాకి చిక్కింది హాని ప్రీత్ సింగ్ .జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదన అంతా చెప్పుకొచ్చింది.ఇప్పటివరకూ జరిగిన పరిణామాల మీద మీ అభిప్రాయం ఏమిటి ఏమి చెప్పాలి అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకి ‘‘మీడియాలో నా గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.

ఈ సంఘటన తర్వాత నేను చాలా భయపడి పారిపోయినట్టు మీడియా చూపిస్తోంది.ప్రస్తుతం నా మానసిక పరిస్థితి బాగాలేదు అని ఇప్పుడు ఈ విషయంలో ఏమి మాట్లాడలేకపోతున్నాను అని తెలిపింది.

దేశద్రోహిగా నాపై ముద్రవేశారు.పోలిసుల అనుమతిలేకుండా నేను కోర్టుకు వెళ్ళేదాన్ని కాదు.

ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని పేర్కొంది

ఎంతో మంది పోలీసులు ఉండగా పంచకులలో అల్లర్లు నేను ఎలా సృష్టించగలను.ఒక వేళ నిజంగా నేను ఆగొడవలకి కారణం అయితే తగిన ఆధారాలని చూపమని చెప్పండి.

అని అడిగింది.జరిగిందంతా అందరూ చూశారు నేను ఏమి చేశాను అని అందరూ నన్ను అంటున్నారు.

ఒక కూతురుగా ఏమి చేయాలో అదే చేసాను.కోర్టులో శిక్షపడుతుంది అని మేము అస్సలు అనుకోలేదు.

కోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది.అక్కడ తీవ్ర విధ్వంసం జరిగిపోయింది.

తండ్రీ కూతుళ్ళకి మధ్య అక్రమ సంభందం ఉంది అంటూ వస్తున్నా వార్తలు అవాస్తవం.ఈ విషయంలో నేను చాలా భాదపడ్డాను అని మీడియాకి తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube