Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

గుంటూరోడు రివ్యూ -Gunturodu Movie Review Gunturodu Collections,Gunturodu Movie First Day Talk,Gunturodu Movie Review,manchu Manoj,Pragya Jaiswal

Featured

చిత్రం : గుంటూరోడు
బ్యానర్ : క్లాప్స్ ఆండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

దర్శకత్వం : ఎస్. కే. సత్య

నిర్మాత : శ్రీవరుణ్ అట్లూరి

సంగీతం : వసంత్, చిన్నా (నేపథ్య సంగీతం)

విడుదల తేది : మార్చి 3, 2017

నటీనటులు : మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, రాజేంద్రప్రసాద్, సంపత్ రాజ్

చాలాకాలంగా మంచు మనోజ్ కి సరైన సక్సెస్ లేదు. రకరకాల జానర్స్ ప్రయత్నించినా, కెరీర్ కి కావాల్సిన హై దొరక్కపోవడంతో ఈసారి మాస్ బాట పట్టిన మనోజ్, “గుంటూరోడు” అనే పక్కా మాస్ టైటిల్ తో మనముందికి వచ్చాడు. మరి ఈ గుంటూరోడిలో మాస్ ప్రేక్షకులకి కావాల్సినంత ఘాటు ఉందో లేదో తేల్చేద్దాం.

కథలోకి వెళితే :

తల్లి లేని బిడ్డ కావడంతో తండ్రి సూర్యనారాయణ (రాజేంద్రప్రసాద్) తన కొడుకు కన్నా (మనోజ్) ని అతిగారాబంగా పెంచుకుంటాడు. దాంతో కన్నా గాలి తిరుగుడు తిరుగుతుంటాడు. ఇక లాభం లేదు, పెళ్ళి చేస్తేనే కన్నా ట్రాక్ లోకి వస్తాడని పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తారు. కాని పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతురిని కాకుండా, తన స్నేహితురాలు అమృత (ప్రగ్యా జైస్వాల్) ని ఇష్టపడతాడు కన్నా. ఇక ప్రేమలో పడిన హీరో ఒక అమ్మాయితో వేసే వేశాలు మనకి తెలిసినవే.

ఇదిలా ఉంటే శేషు (సంపత్ రాజ్) ఒక క్రిమినల్ లాయర్. మనిషికి ఈగో, కోపం చాలా ఎక్కువ. లాయర్ అయ్యుండి నేరాలు చేస్తాడు. ఇతనికి సపోర్ట్ ఓ మినిస్టర్ (కోట శ్రీనివాసరావు). ఒకానొక సందర్భంలో శేషు బ్యాక్ గ్రౌండ్, అతనెవరో తెలీకుండా అతడ్ని కొట్టేస్తాడు కన్నా. పెద్ద అహంకారి అయిన శేషు, చిన్న గొడవకే కన్నాని చంపేయాలని పగని పెంచుకుంటాడు. ఇక్కడొచ్చే తెలుగు సినిమా ట్విస్ట్ ఏంటంటే, ఈ శేషు ఎవరో కాదు, కన్నా ప్రేమిస్తున్న అమృతకి సొంత అన్నయ్య. ఇక్కడినుంచి కథ ఎలాంటి తెలుగు సినిమా మలుపులు తీసుకుందో తెర మీదే చూడండి.

నటీనటులు నటన :

మనోజ్ లావెక్కాడు. కాని సరైన కొలతలు లేని ఆ ఫిజిక్కే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఏమో. ఎందుకంటే ఇలాంటి పక్కా మాస్ సినిమాకి హీరో మాస్ గానే కనిపించాలి కదా. నటనలో కొత్తదనం లేకపోయినా, క్యారక్టర్ లో కూడా కొత్తదనం లేకపోవడంతో మనోజ్ ని నిందించలేం. అయినా, ఫక్తు కమర్షియల్ హీరో స్టయిల్ లో బాగా చేసాడు.

కంచె లాంటి కథాబలం, పాత్రబలం ఉన్న చిత్రంతో మంచి నటిగా గుర్తింపు పొందిన ప్రగ్యా జైస్వాల్ ఇందులో గ్లామర్ డాల్ గా కనిపించింది. చివరగా వచ్చిన మాస్ పాటలో ప్రగ్యా అందాలు మాస్ ప్రేక్షకులని అలరించొచ్చు. సంపత్ రాజ్ విలనీ షరామాములే. ఇక చాలాకాలం తరువాత కోట శ్రీనివాసరావు దాదాపుగా సినిమా మొత్తం కనిపించడం ఓ ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. కామెడియన్స్ బ్యాచ్ లో ఎవరు పేలలేదు.

* టెక్నికల్ టీమ్ :

పాటలు ఫర్వాలేదు. చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్నిసార్లు సరైనోడికి తమన్ అందించిన బీట్స్ ని గుర్తుచేస్తుంది. నిజానికి ఈ బీట్ ని తమన్ ఎక్కడినుంచో కాపి కొడితే, మళ్ళీ దాన్నే చిన్నా కాపీ కొట్టడం ఓ విడ్డూరం. ఫైట్స్ ఏ సెంటర్ ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు కాని బి,సి సెంటర్ ప్రేక్షకలతో ఈలలు వేయించవచ్చు. అయితే, ఫైట్స్ విషయంలో కూడా సరైనోడు పోలికలు కనిపిస్తాయి. మరీ ఓవర్ చేస్తున్నాం అనుకోకపోతే, కొన్ని యాంగిల్స్ లో సినిమాటోగ్రాఫి విషయంలో కూడా సరైనోడు ప్రభావం కనిపిస్తుంది.

* విశ్లేషణ :

ఈ సినిమాలో ఉన్న కథని మనం చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాల్లో చూస్తున్నాం. మాస్ సినిమాలో కథ ఎవరు పట్టించుకుంటారు అంటే, సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిపోతుంది కదా. ఏ క్లాస్ ఆడియెన్స్ ని మెప్పించడం కష్టం అని ఎంత ముక్కుసూటిగా చెబుతున్నామో .. ఈ గుంటూరోడు బి,సి సెంటర్స్ జనాల్ని మాత్రం ఆకట్టుకునే ఛాన్స్ ఉంది అని అంతే విశ్వాసంతో చెబుతున్నాం. కథలో దమ్ములేదు కాని, మనోజ్ లో, మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ లో మాస్ ప్రేక్షకులకి కనిపించే దమ్ము ఉండటంతో, ఈ సినిమా అలాంటి సెంటర్స్‌ లో సందడి చేయవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

* మాస్ కంటెంట్
* మాస్ ఫైట్స్

మైనస్ పాయింట్స్ :

* బలహీనమైన కథ, కథనాలు
* నవ్వించని కామెడి
* ఏ సెంటర్ ప్రేక్షకులు పూర్తిగా దూరంగా ఉండే టేకింగ్

చివరగా :

గుంటురోడి ఘాటు కేవలం మాస్ ప్రేక్షకులకే తగలాలి.

తెలుగుస్టాప్ రేటింగ్ :2.25/5

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Featured

 • Reviews

  Mister Movie Review

  By

  చిత్రం : మిస్టర్ బ్యానర్ : శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్, లియో ప్రొడక్షన్స్ దర్శకత్వం : శ్రీను వైట్ల నిర్మాతలు :...

 • Reviews

  Cheliyaa Movie Review

  By

  చిత్రం : చెలియా బ్యానర్ : మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం నిర్మాతలు : మణిరత్నం సంగీతం : ఏఅర్...

 • Reviews

  Rogue Movie Review

  By

  చిత్రం : రోగ్ బ్యానర్ : తాన్వీ ఫిలిమ్స్ దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాతలు : సీఆర్ మనోహర్, సీఆర్...

 • Reviews

  Guru Movie Review

  By

  చిత్రం : గురు బ్యానర్ : వై నాట్ స్టూడియోస్ దర్శకత్వం : సుధ కొంగర నిర్మాత : ఎస్. శశికాంత్...

To Top
Loading..