గుణశేఖర్ అక్కడ అప్పు చేసారు

గుణశేఖర్ లెక్కల్లో రుద్రమదేవి బడ్జెట్ 80 కోట్లు.నిజంగానే అంత అయిందా లేక అంత చెప్పడం పబ్లిసిటీ స్టంటా అన్న విషయం పక్కన పెడితే, ఎంతైతే పెట్టారో అంత వరకు చాలా కష్టపడ్డారు ఆయన.

 Gunasekhar Assets With A Big Producer-TeluguStop.com

ఉన్నదంతా ఉడ్చి, లేని అప్పులు తెచ్చుకున్న గుణశేఖర్ మరో నిర్మాత దగ్గర తన ఆస్తులు తాకట్టు పెట్టారు.

నిజానికి రుద్రమదేవి 40 కోట్లల్లో అయిపోవాలి, కాని 3డి ఖర్చుల పుణ్యమా అని తడిసి మోపెడు అయింది బడ్జెట్.

దాంతో అప్పులు భీభత్సంగా చేయాల్సి వచ్చింది.చాలా మంది ఫైనాన్సర్స్ దగ్గర డబ్బులు తెచ్చిన గుణశేఖర్ వారి అప్పుల్ని రుద్రమదేవికి వచ్చే తెలుగు,హిందీ శాటిలైట్ రైట్స్ రూపంలో చెల్లించనున్నట్లు సమాచారం.

మరో పక్క 9 కోట్ల అప్పు మరో నిర్మాత దగ్గర తన ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చారు.ఆ నిర్మాత ఎవరు అనేది ఇక్కడ గోప్యంగా ఉంచినా, కనిపెట్టగలిగే పేరే.

ఈ మధ్యే ఓ అగ్రహీరోతో సినిమా మొదలుపెట్టారు ఆ నిర్మాత.అమ్మిన మొత్తానికి పంపిణిదారులు సేఫ్ అయ్యేలా ఉన్నారు కాని, గుణశేఖర్ కష్టాలు ఎలా తీరాలి అనే దాని మీద ఓ క్లారిటి రావట్లేదు.

ఓ పక్క సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోందని ఆనందపడాలా లేక మరో పక్క ఈ అప్పులేలా తీరాలి అని బాధపడాలా ? ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అంటే ఇదేనేమో !

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube