మహేష్ కి ఉన్న కరుణ పవన్, ఎన్టీఆర్ కి లేదంట

GST అమలులోకి రాకముందు 4% నుంచి 14% ఎక్కువ షేర్లు దండుకున్న సినిమా డిజే – దువ్వాడ జగన్నాథం.GST అమలులోకి వచ్చాక ఆ వేడిని చవిచూస్తున్న మొదటి సినిమా నిన్ను కోరి.

 Gst Effect : Mahesh Reduces Spyder Business Prices-TeluguStop.com

చిత్రమైన విషయం ఏమిటంటే, మొదటిది బయ్యర్లకు నష్టాలు తెస్తే, రెండోది లాభాలు తెచ్చిపెడుతోంది.సినిమా బాగా ఆడినా సరే GST ప్రభావం ఉంటుందా అంటే ఉంటుంది.

సగటున 10% షేర్ తగ్గింది నిన్ను కోరి సినిమాకి.ఇంతకుముందు కోటి వచ్చేది అయితే ఇప్పుడు 90 లక్షలు వస్తున్నాయి.

అలా ప్రతి కోటికి 10 లక్షలు తగ్గడం అంటే టోటల్ కలెక్షన్లలో ఎలాంటి ప్రభావం పడుతుందో మీరు ఊహించండి.ఒక పెద్ద సినిమాకి బ్లాక్బస్టర్ టాక్ వచ్చినా డబ్బు పెట్టిన ప్రతి పంపినిదారుడు లాభపడతాడో లేదో గ్యారంటి లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో 10% అదనపు భారం అంటే మాటలా ?

అందుకే స్పైడర్ టీమ్ బయ్యర్లపై వరాల జల్లు కురిపిస్తోంది.బ్రహ్మోత్సవం పీడకల ఇంకా గుర్తు ఉంది కావచ్చు, నిర్మాత పెట్టినదాని కంటే పెద్ద బిజినెస్ ఎలాగో జరుగుతోంది … టూ మచ్ రెట్లు వద్దు, GSTని దృష్టిలో పెట్టుకొని తగ్గించండి అంటూ నిర్మాతలకి పదే పదే చెప్పాడట మహేష్.

దాంతో స్పైడర్ బిజినెస్ రెట్లు తగ్గుతున్నాయి.అలాగని నిర్మాతకి బడ్జెట్ రికవర్ కాదేమో అనుకునేరు.కేవలం శాటిలైట్ నుంచి 32-35 కోట్లు రాబడుతోంది ఈ సినిమా.ఈ లెక్క పెరిగినా పెరగొచ్చు.

బడ్జెట్ 90 కోట్ల నుంచి – 105 కోట్ల మధ్య ఉంటుందట.కాబట్టి రెట్లు తగ్గించినా, ఓవరాల్ బిజినెస్ అన్ని భాషలు కలిపి 130 కోట్లను సులువుగానే దాటేలా ఉంది.

అలాంటప్పుడు పంపినిదారులను ఇబ్బందిపెట్టడం అనవసరం కదా.

ఇది ఇలా ఉంటే జై లవ కుశ టీమ్ ప్లాన్ మరోలా ఉంది.స్పైడర్ కంటే ఈ సినిమా బడ్జెట్ ఓ నలభై కోట్లు తక్కువే.అయినా స్పైడర్ కి చెప్పిన రెట్లు చెబుతున్నారట.కళ్యాణ్ రామ్ అప్పుల్లో ఉండటం వల్లనేమో, ఎన్టీఆర్ కూడా ఏమి అనట్లేదు.రెట్ల కారణంగానే జై లవ కుశ బిజినెస్ ఇంకా ఊపందుకోలేదు అని ట్రేడ్ వర్గాల టాక్.

ఇంకా ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ ఇంకా విచిత్రం.స్పైడర్ కంటే చాలా ఎక్కువ రెట్లు చెబుతున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు పంపినిదారులకి చుక్కలు చూపించాయి, ఇలాంటి సమయంలో మళ్ళీ ఆ రెట్లు ఏంటో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube