కొలెస్టరాల్ తగ్గించే ఆహారం కావాలా?

బ్యాడ్ కొలెస్టరాల్ ఒంట్లో జమ అవడం ఏమాత్రం మంచిది.దీన్నే LDL అని అంటారు.

 Foods To Be Eaten To Reduce Bad Cholesterol Levels-TeluguStop.com

బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ పెరిగిపోతే ఆర్టెరీస్ క్లాగ్ అయిపోయి, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరిగిపోతోంది.ఇలా జరగకూడదంటే మంచి లైఫ్ స్టయిల్ ని అలవర్చుకోవడం ఎంతైనా అవసరం.

అంటే కొలెస్టరాల్ తగ్గించే ఆహారం తీసుకోవాలి.

* తెల్లారి లెవగానే బ్యాడ్ కొలెస్టరాల్ పై పోరాటం మొదలుపెడితే మంచిది.

దీనికి గ్రీన్ టీని మించిన సాధనం లేదు.గ్రీన్ టీ బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ పై చెక్ పెట్టడంలో నేర్పరి.

* వోట్స్ – బార్లీ తో మంచి మీల్ తయారుచేసుకోని రోజూ తినటం అలవాటు చేసుకుంటే బ్యాడ్ కొలెస్టెరాల్ ని తగ్గించడం మరీ అంత కష్టమైన పనేం కాదు.

* ఆల్మండ్స్ లో కూడా ఫైబర్ శాతం బాగా లభిస్తుంది.

ఆల్మండ్స్ రెగ్యులర్ గా తింటే ఎన్నోరకాల రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.అలాగే బ్యాడ్ కొలెస్టరాల్ ని తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

* విటమిన్ సి బాగా లభించే ఆరెంజ్, ఇతర సిట్రస్ ఫలాలు కొలెస్టరాల్ లెవెల్స్ తో ఇబ్బందిపడేవారికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి.ఇవి గుడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని పెంచుతూ, బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.

* సాల్మన్ లో దొరికే ఒమెగా 3 ఫ్యాటి అసిడ్స్ తో పాటు బ్యాడ్ కొలెస్టరాల్ ని తగ్గించేందుకు పనికొచ్చే ప్రోటీన్‌లు ఉంటాయి.

* ఒలీవ్‌ ఆయిల్ ఉపయోగుంచడం ద్వారా బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

ఎందుకంటే దీనిలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ కంటెంట్ మంచి మోతాదులో ఉంటాయి.

* ఇక అవోకాడోలో అన్సాచురేట్ ఫ్యాట్స్ ఎక్కువ.

ఈ లక్షణం వలన అవోకాడో కూడా కొలెస్టరాల్ లెవెల్స్ కి చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube