చెత్త బుట్టలతో ఓట్లు లాగుతున్న కెసిఆర్ ?

ఎన్నికల కోడ్ అమలు అయ్యాక కూడా ఇంటింటికీ రెండు రెండు చెత్త డబ్బాలు అంటూ కెసిఆర్ ఘనమైన తన పధకాన్ని తెలంగాణా లో ప్రారంభించేసారు.గ్రేటర్ ఎన్నికల సమయంలో ఈ ప్రచారం ఎన్నికల కోడ్ కిందకి వస్తుందా రాదా అనే చర్చ జరుగుతూ ఉండగానే హైదరాబాద్ పరిధి లో చాలా చోట్ల చెత్త డబ్బాల పంపిణీ షురూ అయిపొయింది.

 Greater Hyderabad Eleciton Kcr-TeluguStop.com

ఇది ఎన్నికల కోడ్‌ కిందకి వస్తుందా.? రాదా.? అన్నది ఓ సందేహం.

అధికార పార్టీ తలచుకుంటే, నిబంధనలు వాటంతట అవే అటకెక్కేస్తాయనుకోండి.

అది వేరే విషయం.గ్రేటర్‌ ఎన్నికల్లోపు వీలైనంత ఎక్కువమందికి ఈ చెత్త డబ్బాల్ని పంపిణీ చేయాలనే లక్ష్యంగా అధికార గణం తెగ కష్టపడ్తున్నట్లు కన్పిస్తోంది.

అధికార పార్టీ నేతలు గ్రేటర్ ఎన్నికలలో గెలుపు కోసం పార్టీ నేతలు చాలా కష్టాలు పడుతున్నారు.

హైదరాబాద్ కోసం ,ఇక్కడి అభివృద్ధి కోసం అవి చేసేశాం, ఇవి చేసేశాం.

ఇంకా చేసేస్తున్నాం.అని చెబుతూనే, వీలైనంతవరకు తాయిలాలు (చెత్తబుట్టలు, చెత్త సేకరించే వాహనాలు వంటివి) అందిస్తూ.

ఒకేసారి రకరకాల వ్యూహాలతో టీఆర్‌ఎస్‌ ముందుకెళుతోంది.మిగతా విషయాలెలా వున్నా, చెత్త డబ్బాల కాన్సెప్ట్‌ మాత్రం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఇది ఎప్పుడో ప్రకటించేసిన పథకం గనుక, దీన్ని ఎన్నికల తాయిలంగా చూడాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నా, జరుగుతున్నదేమిటో అందరికీ తెల్సిన విషయమే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube