మార్చి 31 తరువాత జియో సిమ్ పడేయొద్దు .. ఎందుకంటే

మరో అయిదు రోజులు దాటితే ఇంటర్నెట్ మీద బ్రతుకుతున్న జీవితాలలో చాలా మార్పులోచ్చేస్తాయి.జియో అక్కడినుంచి తన ఉచిత సర్వీసులు పూర్తిగా ఆపేస్తోంది.

 Great News For Non – Jio Prime Users-TeluguStop.com

కాల్స్ తప్ప ఏది ఉచితం కాదు.ఇంటర్నెట్ కావాలంటే పైకం చెల్లించాల్సిందే.

కాల్స్ అయినా ఉచితంగా ఉంటాయి కదా ఇంటర్నెట్ ది ఏముంది అను అనుకుంటున్నారు ఏమో … రీచార్జ్ చేసుకుంటే తప్ప ఆ కాల్స్ కూడా రాకపోవచ్చు.అంటే, ఎటు చేసి మీరు జియో ప్రైమ్ తీసుకోవాల్సిందే అన్నమాట.

ప్రైం తీసుకోకుండా సింపుల్ జియో వాడితే అది మూర్ఖత్వమే.జియో మళ్ళీ తన వెల్కం ఆఫర్ ని పోడిగిస్తుందేమో అనే ఆశలో ఉండటం, ఆశ కాదు, అత్యాశే.

జూన్ దాకా జియో సర్వీసులు ఉండబోతున్నాయి అని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు.

ఇక జియో సబ్ స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో మీకు తెలిసిన విషయమే.

My Jio యాప్ లోకి వెళ్ళి జియో ప్రైమ్ మీద క్లిక్ చేసి subscribe చేసుకోవాలి.ఇదే కనెక్షన్ మీ డెబిట్/క్రెడిట్ కార్డుతో కాకుండా జియో మని యాప్ తో చేసుకుంటే, ప్రతీ రీఛార్జ్ మీద 50 రూపాయల డిస్కౌంట్ వస్తుందన్న సంగతి ఇప్పటికే చెప్పాం.

ఇదే mobikwik తో చేస్తే 20% డిస్కౌంటు ఉంటుంది.ఇవన్ని ఇలా ఉంటే జియో నుంచి మరో తీపికబురు అందేలా ఉంది.

ప్రస్తుతానికైతే జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన చివరి తేది మార్చి 31.అక్కడినుంచి జియో ప్రైమ్, జియో … రెండు విభాగాలు.కాని సమయం దగ్గరపడింది కదా అని కంగారుపడవద్దు.జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం.మరో రెండుమూడు రోజుల్లో జియో దీనికి సంబంధించి ఓ ప్రకటన చేయవచ్చు.అయితే ఇదేమీ మన కోసం పెంచుతున్న గడువు కాదు.

ఇప్పటివరకు జియోకి ప్రైమ్ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.కేవలం 30 మిలియన్ల మందే ఇప్పటివరకూ జియో ప్రైమ్ తీసుకున్నారట.

అందుకే, గడువు పెంచితే మిగితా 70 మిలియన్ల జియో వినియోగదారులని కూడా ప్రైమ్ వైపు మళ్ళించవచ్చు అని జియో ప్లాన్.ఇదో గుడ్ న్యూస్.

మరో గుడ్ న్యూస్ ఏంటంటే, జియో తన రిఛార్జ్ల మీద మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించే అవకాశలున్నాయట.ప్లాన్స్ లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు కాని, అదనపు డేటా, రేటుపై డిస్కౌంట్ అందించవచ్చు అని తెలుస్తోంది.

కాబట్టి మార్చి 31 దాటగానే జియో సిమ్ ని పడేయకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube