మైనర్ బాలికతో అలా చేస్తే అది రేప్ కాదు ... తేల్చిన గవర్నమెంటు

ఇద్దరు పెళ్ళి చేసుకున్న భాగస్వాములు శృంగారం చేసుకుంటే అందులో లీగల్ గా కాని, మోరల్ గా కాని ఎలాంటి తప్పు లేదు.ఇద్దరు మేజర్లు పెళ్ళికాకుండానే శారీరక సంబంధం పెట్టుకుంటే అది మోరల్ గా తప్పు కావచ్చు ఏమో కాని లీగల్ గా తప్పు కాదు.

 Govt Defends The Section Allowing Forced $ex With Minor Wife-TeluguStop.com

మరి పెళ్ళి జరిగిన దంపతులలో భార్యకి శృంగారం ఇష్టం లేకపోయినా భర్త శృంగారం చేస్తే ? దాన్ని రేప్ కింద పరిగణించాలా ? ఒకరికి సమ్మతి లేని శృంగారాన్ని మానభంగం కిందే జమకట్టాలా ? కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలల ఎన్నో న్యాయస్థానాలకి అంతుచిక్కని ప్రశ్నగా మారింది ఇది.అందులోనూ ఇలాంటి సందర్భాల్లో భార్య మైనర్ అయితే ? కనీసం అప్పుడైనా దాన్ని రేప్ కింద పరిగణించి “మేరిటియల్ రేప్” కేసు వేయాలా ? సూప్రీమ్ కోర్టులో ఈ విషయంపై వాడివేడి చర్చ జరిగింది.

ఇండియన్ పినల్ కోడ్ 375 (2) లో రేప్ కేసుల్లో ఓ చిన్న సడలింపు ఉంది.అదేమిటంటే పెళ్ళి చేసుకున్న భర్త, తన భార్య మైనర్ అయినా, తనకి ఇష్టం లేని శృంగారం చేసినా, దాన్ని రేప్ కింద పరిగణించడం జరగదు.

దీన్ని ఒక లూప్ హోల్ గా చూపిస్తూ ఒక NGO సుప్రీంకోర్టుని దీని సవరించమని అడిగింది.దాంతో ఈ సెక్షన్ మీద న్యాయస్థానానికి, గవర్నమెంటుకి చర్చ మొదలైంది.

ఆ ఎన్జీవో వేసిన పిటిషన్లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు పెళ్ళికి అర్హులు కారు, అలాంటిది ఒక మైనర్ అమ్మాయితో, పెళ్ళి చేసుకున్న మగాడు, తనకి ఇష్టం లేకున్నా శృంగారం చేయడాన్ని తప్పుపట్టకపోవడం అంటే, బాల్య వివాహాల్ని ఎంకరేజ్ చేసినట్లే, మొదటగా మైనర్ ని పెళ్ళి చేసుకున్నందుకు, ఆ తరువాత తన అనుమతి లేకుండా శృంగారం చేసినందుకు, రెండు కారణాలతో అలాంటి భర్తలని శిక్షించాలని, పెళ్ళి చేసుకున్నంత మాత్రానా రేప్ చేసే హక్కు లేదని ఎన్జీవో వారు పేర్కొన్నారు.

అయితే ప్రభుత్వం వారి వెర్షన్ ఇంకోలా ఉంది.

పెళ్ళిలో ప్రతి విషయానికి లీగల్ గా ఆలోచించలేమని, అంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని, అలాగే ఆ అమ్మాయిల పెళ్ళితో పాటు జీవితం దుర్భరం అవుతాయని, వాస్తవంలోకి వస్తే, దేశంలో 23 మిలియన్ల మైనర్ అమ్మాయిలు పెళ్ళి చేసుకొని ఉంటారు, మధ్యలో పెళ్ళి చెడిపోతే వారి జీవితం కష్టమైపోతుంది అని ప్రభుత్వం ఆ సెక్షన్ ని విజయవంతంగా డిఫెండ్ చేయగలిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube