బాలీవుడ్‌కు గోవిందుడు?

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మరియు కృష్ణవంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే’.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి యావరేజ్‌ టాక్‌ వచ్చింది.

 Govindudu Andarivadele Remake In Hindi?-TeluguStop.com

వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను బండ్ల గణేష్‌ నిర్మించిన విషయం తెల్సిందే.

ఈ సినిమాను త్వరలో బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతన్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం బాలీవుడ్‌ రీమేక్‌ రైట్స్‌ కోసం నిర్మాత బండ్ల గణేష్‌తో బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతున్నారు.

బాలీవుడ్‌లో ‘గోవిందుడు అందరి వాడేలే’ను ప్రభుదేవా రీమేక్‌ చేయబోతున్నాడు.ఈయన గతంలో ‘విక్రమార్కుకుడు’, ‘పోకిరి’ సినిమాలను రీమేక్‌ చేసి సూపర్‌ హిట్‌ దర్శకుడు అనిపించుకున్నాడు.

తాజాగా ఈ కొరియోగ్రాఫర్‌ కం డైరెక్టర్‌ ఈ మెగా మూవీపై దృష్టి పెట్టాడు.ఇటీవలే ఈ దర్శకుడు గోవిందుడు.

సినిమా చూసినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయాలనే నిర్ణయానికి ప్రభుదేవా వచ్చాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్టబోతున్నాడు.గోవిందుడు.

సినిమాలో తాతగా నటించిన ప్రకాష్‌ రాజ్‌ను హిందీలో కూడా కొనసాగించాలని ప్రభుదేవా భావిస్తున్నాడు.ఈ రీమేక్‌ గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube