మంగుళూరు మిర్చి అనుష్క చూపంతా ఇపుడు బాహుబలి కన్ క్లూజన్ పైనే ఉంది.ఈ ఒక్క సినిమా రిలీజ్ అయ్యాక అనుష్క పెళ్లి చేసుకుని ఎంచక్కా సెటిల్ అయిపోతుందని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి అనుష్క పెళ్లి మ్యాటర్‌పై ఇండస్ట్రీలో గత రెండు మూడేళ్లుగా వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్‌కు చెందిన ఓ ముసలి నిర్మాతతో అనుష్క పెళ్లి ఉంటుందని కూడా మధ్యలో వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత కొద్ది రోజులకు బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్‌మేన్‌తో సైతం ఆమె ప్రేమలో ఉందని… బాహుబలి 2 తర్వాత అతడితో అనుష్క పెళ్లి ఉంటుందని అన్నారు.చివరకు ఇప్పుడు ఆ రెండు పెళ్లి వార్తలు పుకార్లే అని తెలుస్తోంది.
ఇప్పటికే మూడున్నర పదుల వయస్సుకు చేరువైన ఈ జేజమ్మకు ఇంట్లో వాళ్లు ఓ మాంచి పెళ్లి సంబంధం చూశారట.
అతడు కూడా కర్ణాటకకు చెందిన బిజినెస్‌మేన్ అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అనుష్క గ్లామర్‌పై ఇండస్ట్రీలో బ్యాడ్ టాక్ నడుస్తోంది.సైజ్ జీరో సినిమా కోసం ఆమె లావుగా పెరగడం చాలా పెద్ద మిస్టేక్ అన్న టాక్ వస్తోంది.
ఆ సినిమా కోసం ఆమె బాగా లావుగా పెరిగింది.అప్పటి నుంచి ఆమె బబ్లీగానే కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే రాజమౌళి వెయిట్ తగ్గాలని ఆమెకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆమె ఫిజిక్ మారలేదు.దీంతో ఆమెకు బాహుబలి తర్వాత విజయశాంతిలా లేడీ ఓరియంటెడ్ రోల్స్ మినహా మిగిలిన రోల్స్ రావని అంటున్నారు.
బాహుబలి తర్వాత దశాబ్ద కాలంగా అప్రతిహతంగా కొనసాగిన అనుష్క శకం ముగిసినట్టే అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.