చిన్న సినిమాకు మంచి రోజులొచ్చాయా..!

తమలో సృజనాత్మకత ఉన్న ప్రతి ఒక్కరు ఓ టీం ఏర్పాటు చేసుకుని చిన్న షార్ట్ ఫిలింస్ చేయడం మాములే అయ్యింది.అయితే వాటిలో ఎంతమంది కంటెంట్ ఓరియెంటెడ్ చేస్తున్నారు అన్నది పక్కన పెడితే ఈ షార్ట్ సినిమాల హవా ఓ రేంజ్లో కొనసాగుతుంది.

 Good Days For Small Movies-TeluguStop.com

అయితే టాలీవుడ్లో సిని కార్మీకుల డిమాండ్ మేరకు ఓ చిన్న సినిమా అయినా సరే వారి వల్ల తడిసి మోపెడయ్యే పరిస్థితి వచ్చింది.రిజిస్టర్ మెంబర్స్ తోనే సినిమా పూర్తి చేయాలి.

అలా జగరాలంటే వారు అడిగినంత ఇవ్వాల్సిందే.అందుకే ఈ చికాకులేం లేకుండా షార్ట్ ఫిలింస్ తీస్తూ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసుకుంటున్నారు.

షార్ట్ ఫిలింస్ మాత్రమే కాదు యూ ట్యూబ్ లో రిలీజ్ చేసే సినిమాలు కూడా ఉన్నాయి.థియేటర్ల సమస్య ఒకటైతే ఉన్న డబ్బులన్ని సినిమా తీసేందుకు ఖర్చు పెట్టి రిలీజ్ చేసే అవకాశం లేక ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఫిల్మ్ చాంబర్లో ఈ విషయం గురించి డిస్కషన్స్ జరిగాయట.ఏ సినిమా అయినా సరే రిజిస్టర్ కార్మికులతోనే కాదు ఎలాంటి వారితోనైనా సినిమాను పూర్తి చేసే అవకాశాన్ని, స్వేచ్చను ఇచ్చేలా చేస్తున్నారట.

అంతేకాదు రానున్న రోజుల్లో మిని థియేటర్స్ భారీగా రాబోతున్నాయి అందుకే చిన్న సినిమాలకు కూడా మంచి రోజులు వచ్చినట్టే కనబడుతున్నాయి.

ఓ విధంగా తమ చిన్న ఐడియాతో ఉన్నంత బడ్జెట్ లో సినిమా తీయాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం అని చెప్పొచ్చు.

మొత్తానికి టాలీవుడ్లో జరుగుతున్న ఈ పరిణామాలు మంచికే అయినా రిజిస్టర్ కార్మికుల నుండి నిరసనల జ్వాలలు వెళ్లువెత్తే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube