బంగారం స్కాంలో బాహుబలి

పాత 500 మరియు 1000 నోట్లు చెల్లవు అంటూ నరేంద్ర మోడీ చేసిన ప్రకటన బ్లాక్ మని హోల్డర్స్ ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.తమవద్ద ఉన్న ఓల్డ్ కరెన్సీని వదిలించుకునేందుకు చాలామంది బంగారం కొనేశారు.

 Gold Scam On The Name Of Baahubali-TeluguStop.com

మీకు తెలిసిన విషయమే, ఐటి యాక్ట్ కింద బంగారం అమ్మేముందు కొనుగోలుదారుడి వివరాలు తీసుకోవాలి షాప్ ఓనర్లు.కాని ఓ పేరు మోసిన నగల దూకాణం ఎవరికి పడితే వారికి బంగారం అమ్మేసిందట.

ఆరాతీస్తే, దాదాపుగా 5000 ట్రాన్సాక్షన్స్ ఒక నగల దూకాణంలో, నరేంద్ర మోడీ ప్రకటన అనంతరం జరిగినట్లు ఐటి అధికారుల వెలుగులోకి వచ్చింది.

వెంటనే రంగంలోకి దిగి ఆ నగల షాపు మీద దాడికి దిగారు.

ఊరు పేరు లేని కొనుగోళ్ళు చాలానే జరిగాయి.ఇక నకీలి పేర్ల మీద కూడా చాలా కొనుగోళ్ళు జరిగాయి.

అందులో కొన్ని కొనుగోళ్ళు విచిత్రంగా “బాహుబలి” పేరు మీద జరిగాయట.మీరు విన్నది నిజమే, బాహుబలి అనే పేరు మీద బంగారం కొన్నారు.

మరి ఇంత దారుణంగా ఎలా స్కాంకి సహాయం చేసావని షాపు ఓనర్ ని ప్రశ్నిస్తే, నీళ్ళు మింగటమే తప్ప సమాధానం రాలేదట.

మొత్తానికి ఐటి అధికారులు ఓసారి ప్రత్యేక్షంగా బాహుబలి నిర్మాతల మీద, మరోసారి నకిలీ బాహుబలి కొనుగోళ్ళ మీదా దాడి చేశారన్నమాట.

ఈ విషయం జక్కన్న దాకా వెళ్ళే ఉంటుంది.అప్పుడు ఆయన స్పందన ఎలా ఉండిందో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube