Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పేంటి అంటున్న హీరోయిన్ -Girls Who Smoke Aren’t Characterless – Says Bolly Beauty

సిగరెట్, మద్యం అనేవి ఎవరు తాగినా అది అనారోగ్యమే. మగవారైతే ఏంటి ఆడవారైతే ఏంటి .. ఎవరిదైనా మనిషి శరీరమే కదా. కాని ఇలా ఆలోచించాల్సింది పోయి సమాజం ఇంకోలా ఆలోచిస్తుంది. కుర్రాడు ఓ వయసుకి వచ్చాకా కూడా వాడికి సిగరెట్ లేదా మందు అలవాటు లేకపోతే వెరైటిగా చూస్తారు జనాలు. అసలు వీడు అబ్బాయేనా అనే విచిత్ర అనుమానాలు కూడా వ్యక్తపరుస్తారు కొంతమంది. మరి ఇదే అలవాటు అమ్మాయికి అయితే? అమ్మాయి సిగరెట్ తాగితే, అమ్మాయి మద్యం సేవిస్తే? వెంటనే ఆ అమ్మాయికి తిరుగుబోతు, క్యారక్టర్ లేని అమ్మాయి అంటూ ట్యాగ్స్ ఇచ్చేస్తారు. అబ్బాయికి అర్హతగా, ఆభరణంగా అనిపించే ఈ దురలవాట్లు, అమ్మాయి విషయంలో మాత్రం నెగెటివ్ గా అనిపిస్తాయి. ఇలా ఎందుకు అని ప్రశ్నిస్తోంది బాలివుడ్ భామ, మన 1- నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్.

“ధూమపానం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. దాన్ని అలవాటు చేసుకోకపోతేనే మంచిది. నాకు సిగరెట్ కాల్చే అలవాటు లేదు. కాని ఎవరైనా అమ్మాయికి సిగరెట్ కాని, మందు కాని అలవాటు ఉంటే, ఇక ఒంటి మీద పచ్చబొట్టు వేయించుకుంటే, ఆ అమ్మాయికి క్యారక్టర్ లేదు అని డిసైడ్ చేసేస్తారు. అసలు అమ్మాయి క్యారక్టర్ కి సిగరెట్ లేదా పచ్చబొట్టుకి ఏమిటి సంబంధం? సిగరెట్ కాల్చే ప్రతి మగవాడు, టాటూ వేయించుకునే ప్రతి మగవాడు చెడ్డవాడు అయిపోతాడా? అబ్బాయికి లేని తప్పు అమ్మాయికి ఎందుకు? సిగరెట్ అనేది ఒక చెడ్డ అలవాటు. ఎందుకంటే అది మనిషికి శారీరకంగా నష్టం చేస్తుంది. కాని ఒకరి క్యారక్టర్ ని చెడుగా మార్చదు. సిగరెట్ తాగినందుకు అమ్మాయి క్యారక్టర్ లేనిది అయితే, అబ్బాయి కూడా క్యారక్టర్ లేనివాడే” అంటూ ఫైర్ అయ్యింది కృతి.

సడెన్ గా ఈ సాఫ్ట్ అమ్మాయికి ఇంత కోపం ఎందుకు వచ్చింది, అసలు సిగరెట్ మరియు టాటూ టాపిక్ ఎందుకు వచ్చింది అనే కదా మీ డౌటు. ఈ అమ్మడు కొత్త సినిమా బరేలి కి బర్ఫీలో ఒక బిందాజ్ అమ్మాయి పాత్ర చేసింది కృతి. తన క్యారక్టర్ గురించి ప్రశ్నించినప్పుడే ఇలా సమాధానం ఇచ్చింది.

Continue Reading
More Posts
To Top