అందరిని పేరు పెట్టి పిలుస్తాం .మన గర్ల్ ఫ్రెండ్ ని అలాగే పేరు పెట్టి పిలిస్తే ఇక తను స్పెషల్ గా ఎలా ఫీల్ అవుతుంది .
అందుకే ఈ మధ్య అందరు కాకపోయినా , చాలావరకు , మరీ ముఖ్యంగా మహానగరాల్లో “బేబి ” అని ముద్దుగా పిలుచుకుంటున్నారు ప్రేమికులు .ఈ బేబి అనే పదం అబ్బాయిలకు ఎలా ఉంటుందో కాని , అమ్మాయిలకు మాత్రం భలే ఇష్టం తెలుసా .
అలాగని షార్ట్ గా “బెబ్ ” అని మాత్రం అనకండి .బేబ్ అనే పదాన్ని అసహ్యించుకుంటారట అమ్మాయిలు .బేబి అనే పదం మాత్రం గమ్మత్తుగా అనిపిస్తుందట .ఏదో చిన్నపాపను గారం చేసి మాట్లాడినట్టు , బాయ్ ఫ్రెండ్ తండ్రిలాగా ప్రవర్తిస్తున్నట్లు , అదోరకం ఊహల విహారయాత్రకు వెళ్ళిపోతారు అమ్మాయిలు , బాయ్ ఫ్రెండ్ నోటి నుంచి బేబి అనే పదాన్ని వినగానే .
ఈ మధ్య సినిమాల్లో వాడేస్తున్నారుగా , ఇక మనమేం పిలుస్తాం అని అనుకోకండి , బేబి అనే పిలుపు కొత్తది కాదు కాని , విలువైనది .మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఓ వారంరోజులు బేబి అని పిలవండి.తనలోని ముసిముసి నవ్వులు మీకు ఖచ్చింతంగా కనిపిస్తాయి .