బరువు తగ్గడానికి దానితో సంబంధం లేదు

కొంతమందిని లావుగా ఎందుకున్నావని అడిగితే వంశపారంపర్యంగా ఈ భారికాయం వచ్చిందని చెప్పేస్తారు.అది అబద్ధం అవకపోవచ్చు.

 Genes Will Not Stop You From Reducing Weight – Study-TeluguStop.com

ఎందుకంటే కొంతమందికి ఇలా జరుగుతుంది.జీన్స్ వలన లావుగా ఉండొచ్చు.కాని బరువు తగ్గడానికి జీన్స్ అడ్డుపడవని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.

“ఇకపై బరవు తగ్గమంటే సాకుగా జీన్స్ ని చూపెట్టొద్దు.మా అధ్యయనంలో తేలిందేంటంటే, మంచి ఆహారపు అలవాట్లు, ఫిజికల్లి యాక్టీవ్ గా ఉండటం ద్వారా మీ జీన్స్ తో సంబంధం లేకుండా బరువు తగ్గొచ్చు.బరువు తగ్గాలని నిర్ణయించుకోని, చక్కగా డైట్ ని ప్లాన్ చేసుకోని, మంచి వ్యాయామం చేస్తే జీన్స్ మోసుకొచ్చిన అవాంతరాలని దాటి బరువు తగ్గడం సాధ్యమైన విషయమే” అంటూ బ్రిటన్ కు చెందిన ప్రొఫేసర్ జాన్ మేథర్స్ చెప్పుకొచ్చారు.

అవును, లావుగా ఉండటానికి కారణమయ్యే FTO జీన్, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు అడ్టంకులు మాత్రం సృష్టించట్లేదట.9500 మందిపై బరువు తగ్గుతున్న సమయంలో పరిశోధన చేసి ఈ విషయాలన్ని ఓ రిపోర్టులో తెలిపారు బ్రిటన్ పరిశోధకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube