మహేష్ కి థియేటర్లు దొరక్కుండా చేస్తున్న అల్లు అర్జున్

అసలే నైజాం బెనిఫిట్ షోలు లేక మూలుగుతున్న బ్రహ్మోత్సవం సినిమా మీద తాటికాయ పడినంత పనైంది.సూపర్ స్టార్ అనే బిరుదు, యూనివర్సల్ ఫాలోయింగ్, ఫ్యామిలి సినిమాతో వంద కోట్ల బిజినెస్ రాబట్టినోడు … అయితే ఏం, నేను తల్చుకుంటే సూపర్ స్టార్ అయినా దండగే అనేలా ఉంది అల్లు అర్జున్ వ్యవహారం.

 Geetha Arts Blocking Theaters – Brahmotsavam Unit In Despair-TeluguStop.com

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద పబ్లిక్ గా సంచలన వాఖ్యలు మీడియా నోట్లో నానుతున్న అల్లు అర్జున్, ఇప్పుడు మహేష్ బాబు మీద చాటుగా గేమ్ ఆడుతున్నాడని టాక్.మహేష్ బాబు అభిమానులు జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే, చాలా చోట్ల బ్రహ్మోత్సవం చిత్రానికి దొరక్కుండా థియేటర్లు బ్లాక్ చేసుకుందట గీతా ఆర్ట్స్.

ఇది ఏదో గాసిప్పులా మేం రాస్తున్న మాట కాదండి.ట్రేడ్ వర్గాలే జరుగున్న తతంగాన్ని ముక్కున వేలేసుకోని చర్చించుకుంటున్నాయి.

మహేష్ బాబు లాంటి అగ్ర కథానాయకుడి సినిమాకు సరిపడ థియేటర్లు దొరక్కపోవడం ఏంటనేది ఎవరికి మింగుడు పడని విషయంలా మారింది.

ఇన్ని రోజులు, చిన్న సినిమాల్ని తొక్కేస్తున్నారు, థియేటర్లు లాకుంటున్నారు అని మీడియావారు తెగ హంగామా చేస్తే అయ్యో పాపం, చిన్నవాళ్ళ పరిస్థితి ఇంతేనా అని అనుకున్నాం.

చిన్నవాళ్ళేంటి, ఎంతటివాడైనా గీతా ఆర్ట్స్ రాజకీయాలకు తలవంచాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు ఫిలింనగర్ జనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube