బాలకృష్ణ సినిమా టైటిల్ మారింది ?

నందమూరి బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్ లో తన 100వ సినిమాలో నటించబోతున్నాడు.నిన్నటివరకు ఈ చిత్రానికి టైటిల్ గా ‘యోధుడు’ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

 Balayya Movie Title Has Been Changed-TeluguStop.com

అయితే క్రిష్ నిర్మాణ సంస్థ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ చిత్రం కోసం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.దీంతో క్రిష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులు కానున్నారని తెలుస్తోంది.

దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్.

కథను బట్టి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని తెలుస్తోంది.

ఉగాది రోజున ఈ సినిమాను ప్రారంభించనున్నారు.బాలకృష్ణ ఆహార్యం, స్టైల్ , లూక్స్ అన్నీ ఈ సినిమా కోసం మార్చేసారు క్రిష్.

అద్వితీయమైన రాజుగా బలయ్య్యని చూపిస్తూ ఈ సినిమా సాగుతుంది అంటున్నారు.బాలకృష్ణ తన కెరీర్ మొత్తం లో చేసిన సినిమాలు ఒక ఎత్తూ ఈ సినిమా ఒక ఎత్తు అంటున్నారు .క్రిష్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నిజానికి సాయి కొర్ర పాటి ప్రొడ్యూస్ చెయ్యాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube